Duvvada Srinivas Arrest: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తర్వాత మ్యాచ్ గెలిచి ఫైనల్స్ అడుగుపెడుతుందా? లేదా? అన్నదాని కంటే కూటమి ప్రభుత్వం నెక్ట్స్ ఎవరిని అరెస్టు చేస్తుందనేది రాష్ట్రంలో ఇంటరెస్టింగ్ టాపిక్‌గా మారింది.. ఇప్పటికే వంశీ, పోసాని లను అరెస్టు చేసిన పోలీసులు అరెస్టుల పర్వంలో స్పీడ్ పెంచారు. వంశీ, పోసాని కృష్ణమురళీల తరువాత అరదండాల లిస్టులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో ఉత్తరాంధ్రకు చెందిన బూతుల నాయకుడు పేరు ప్రముఖంగా ఫోకస్ అవుతుంది. ఆ సార్ ఎవరో? ఆయన లీలలేంటో మీరే చూడండి.
అరెస్ట్ భయంతో వణుకుతున్న వైసీపీ నేతలు
వైసీపి ప్రభుత్వ హయాంలో కూటమి నాయకులపై నోరుజారిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భయం పట్టుకుంది. ఎక్కడ తప వంతు వస్తుందో.. ఎప్పుడు అరెస్టు చేస్తారో అని వణికిపోతున్నారు . ఇప్పటికే బూతులు సామ్రాట్ పోసాని కృష్ణమురళీని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై గత ప్రభుత్వం పాలనలో ఇష్టానుసారంగా కొంతమంది రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాలన పై దృష్టిపెట్టడంతో .. తమ పై ఫోకస్ పెట్టడం లేదని, తమకేం కాదులే అని సదరు విమర్శలు చేసిన నాయకులు లైట్ తీసుకున్నారు.
వేసీపీ నేతల తప్పుల చిట్టాలను సేకరించిన సర్కారు
కానీ వారి ఒకటి ఆలోచిస్తే కూటమి నాయకులు మరొకలా ఆలోచించారు. విమర్శలు చేసిన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల వైఖరిని చేతకాని తనంలా తీసుకుని రిలాక్స్ అయ్యారు. అయితే ప్రభుత్వ సైలెంట్ గా ఉంటూనే.. వైసీపీ నేతల తప్పులు లెక్కలతో సహా సేకరించారు. తప్పుచేసిన ఏ ఒక్కడు తప్పించుకోలేని విధంగా చక్రం తిప్పారు. కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తున్నారు. దాంతో ఏమి కాదులే అనుకునే వాళ్లంతా కలుగుళ్ళో ఎలకల్లా గిలా గిలా కొట్టుకుంటున్నారు. బయటికి కూటమి నాయకులు ఎన్నికేసులు పెట్టినా.. భయపడేదిలేదని బుకాయిస్తున్నా … లో లోపల మాత్రం చాలా బయపడుతున్నారట.
నోరు పారేసుకున్న సిదిరి అప్పలరాజు, దువ్వాడ
శ్రీకాకుళం జిల్లా లోని కొంతమంది నాయకులు కూడా కూటమి నాయకులపై గతంలో ఇష్టానుసారంగా విమర్శలు చేసారు. అందులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తోపాటు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌లు ముందు వరుసలో ఉంటారు. వారి బూతుపురాణాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందట. రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలవ్వడంతో ఇప్పటికే సదరు నాయకులపై కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పలాస, టెక్కలి పోలీస్ స్టేషన్ లలో పిర్యాదులు కూడా చేశారు… దువ్వాడ మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి.
పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన దువ్వాడ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తగత విమర్శలు పై అప్పట్లో జనసైనికులు, వీరమహిళలు దువ్వాడను ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకువాలంటూ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. కానీ అప్పట్లో వైసిపి ప్రభుత్వం అధికారం లో ఉండటం తో జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహం పెల్లుబికినా చేసేది ఏమిలేక జనసైనికులు ఓపిక పట్టారు.
దువ్వాడపై టెక్కలి జనసేన ఇన్చార్జ్ కణితి కిరణ్ కుమార్ ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన కొద్దిరోజులకే టెక్కలి జనసేన ఇన్చార్జ్ కణితి కిరణ్‌కుమార్ టెక్కలి పోలీస్ స్టేషన్లో నవంబర్ 18న దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తగత విమర్శలు చేసిన దువ్వాడ పై చర్యలు తీసుకోవాలంటూ కిరణ్ కుమార్ ఫిర్యాదు లో పేర్కొన్నారు. టెక్కలి జనసేన ఇంచార్జి కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు కొద్దిరోజుల తరువాత దువ్వాడకు 41ఏ నోటీసులు కూడా ఇచ్చారు.
విచారణ సమయంలో చెలరేగిపోయిన దువ్వాడ
నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనదైన స్టైల్లో వివరణ కూడా ఇచ్చారు. తాను పవన్ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే కిరణ్‌కుమార్‌కి ఏంటి సంబంధం అని దువ్వాడ ఫైర్ అయ్యారు. తనపై ఫిర్యాదు చేయాలి అంటే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేని లౌక్యం ప్రదర్శించారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆ సందర్భంగా దువ్వాడ మీసం తిప్పారు. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
తిరిగి తిట్ల దండకాలు మొదలుపెట్టిన వైసీపీ నాయకులు
ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసులు పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో కూటమి నాయకులు కొంతకాలం సైలెంట్ అయ్యారు. పూర్తిగా పాలన పై దృష్టి పెట్టారు. దాంతో ప్రభుత్వం తమను ఏమీ చేయలేదనే ధీమాతో వైసీపీ నాయకులు తిరిగి తిట్ల దండకాలు మొదలు పెట్టారు. తమను ఎవరేం చేయలేరని ప్రెస్ మీట్లు పెట్టి మరీ హాడావుడి చేస్తున్నారు. దాంతో మిత్ర పక్షాల కార్యకర్తలు తమ అధినేతలపై అగ్రహం వ్యక్తం చేయడం మెదలుపెట్టారు. కార్యకర్తలు ఎంత కోపంగా ఉన్నా ముఖ్యనేతలు మాత్రం సమన్వయం పాటిస్తూనే వచ్చారు.
వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళీని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇప్పుడు అలాంటి వారిపై చర్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఒక్కొరిని బయటకి లాక్కోచ్చే పని మొదలు పెట్టారు. మొదటిగా సినినటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళీని పోలీసులు హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చారు. పోసాని అరెస్టుతో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న మిగిలిన వైసీపీ నాయకులకు హెచ్చరికలు పంపినట్లైంది.
తర్వాత దువ్వాడే అని సిగ్నెల్స్ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
ఎప్పుడూ సౌమ్యంగా ఉండే జనసేన కీలక నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరైతే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారో వారిని వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే ఒకడు జైల్లో గగ్గోలు పెడుతున్నాడని పోసానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్‌ను దూషించిన ఎమ్మెల్సీకి కూడా పోసాని గతే పడుతుందని దువ్వాడపై ఫైర్ అయ్యారు.
దువ్వాడపై వివిధ జిల్లాల్లో వరుసగా ఫిర్యాదులు
మనోహర్ హెచ్చరికలతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. తరువాత వికెట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసే అన్న చర్చ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నడుస్తోంది. గత ఇదేళ్ల పాలనలో దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలపై కూడా పోలీసులు దృష్టి సారించారట.. నిమ్మాడ పంచాయితీ ఎన్నికల సందర్బంగా జరిగిన అల్లర్లపై కూడా పోలీస్ లు ఫోకస్ పెట్టారంట. నిమ్మాడ పంచాయితీ ఎన్నికల సందర్బంగా దువ్వాడ శ్రీనివాస్ క్రికెట్ బ్యాట్ లు పట్టుకుని నిమ్మాడ గ్రామ వీధుల్లో చేసిన హంగామా అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల లో సంచలనం రేపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో జనసైనికులు దువ్వాడపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ క్రమంలో ఏ అర్ధరాత్రి వచ్చి పోలీసులు తలుపులు కొడతారో అని దువ్వాడ వర్గీయలు టెన్షన్ పడుతున్నారంట.