Meenakshi Chowdary : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) పరిచయం అవసరం లేని పేరు. ఈమె గది కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా ఈమె ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
మీనాక్షి చౌదరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె బర్త్ డే వేడుకలను ఫ్యాన్స్ ఘనంగా చేశారు. ఆ వేడుకలను చూసి మీనాక్షి చౌదరి ఎమోషనల్ అయ్యింది. ఫ్యాన్స్ అభిమానం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు ఫ్యాన్స్ గ్రాండ్ గా స్వాగతం పలికారు. కేక్ కటింగ్ కోసం బాగా డెకరేషన్ చేసి బర్త్ డే ఏర్పాట్లను ఘనంగా చేశారు. వాళ్ల అభిమానం చూసి సంతోషంతో పొంగిపోయిన హీరోయిన్ ఎమోషనల్ అయ్యింది. ఆమె సెలెబ్రేషన్స్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈమె గతేడాది మహేష్ బాబుతో గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్(Lucky Bhaskar) సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న మీనాక్షి.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.. మీనాక్షి యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలోనూ కీలక పత్ర పోషిస్తోంది.. అలాగే అనగనగా ఒకరోజు చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.. వీటితో పాటుగా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాల గురించి బయటపెట్టనుందని టాక్.. ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయ్యింది. స్టార్ హీరోలు సైతం మీనాక్షి తోనే సినిమా చేస్తామంటూ ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Also Read :జీవితంలో నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే.. బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్..!
ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ అమ్మడు ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador for Women Empowerment)గా ఏపీ ప్రభుత్వం మీనాక్షి చౌదరిని నియమించింది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) సందర్భంగా ఈ ప్రకటన అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం.. ఈ వార్త విన్న ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..