OTT Movie : సమాజంలో సైకోలు ఇప్పుడు ఎక్కువగానే ఉన్నారు. అయితే వికృత రూపం దాల్చిన సైకోలు కొంతమంది ఉంటారు. వీళ్ళ చేతికి ఒంటరిగా ఎవరైనా చిక్కితే అంతే సంగతులు. మరి ఇటువంటి సైకోలు అడవి ప్రాంతంలో ఉంటే.. ఎవరైనా మనుషులు వీళ్ళ చేతికి చిక్కితే.. పరిస్తితి ఘోరంగా ఉంటుంది. అటువంటి హింస ఎక్కువగా ఉండే ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సైకో థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘బుట్చర్స్‘ (Butchers). ఈ మూవీకి అడ్రియన్ లాంగ్లీ దర్శకత్వం వహించారు. ఇందులో సైమన్ ఫిలిప్స్, మైఖేల్ స్వాటన్, జూలీ మెయిన్‌విల్లే, అన్నేకరోలిన్ బినెట్, సమంతా డి బెనెట్ నటించారు. ఈ మూవీలో అన్న దమ్ములు సైకోలుగా మారి దొరికిన వాళ్ళని దొరికినట్టే చంపేస్తుంటారు. ఈ సైకో థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఒక అడవి ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వీళ్లకు ఎవరైనా మనుషులు దొరికితే చిత్రహింసలు పెట్టి చంపుతూ ఉంటారు. ఇలా ఒకసారి ఆ ప్రాంతానికి ఒక జంట వస్తుంది. వాళ్లలో అబ్బాయిని చంపి, మొక్కలు చేసి చెరువులో పడేస్తారు. అమ్మాయిని ఆ సైకో బ్రదర్స్ ఎత్తుకెళ్ళి ఒకచోట బంధిస్తారు. ఈ అన్నదమ్ములు ఒకప్పుడు మంచిగానే ఉండేవారు. వాళ్లలో ఒకరి కూతుర్ని కొంతమంది ఆకతాయిలు కార్ తో గుద్దేసి పట్టించుకోకుండా వెళ్లిపోతారు. తీవ్ర గాయాలతో ఆ చిన్న పిల్ల అక్కడికక్కడే చనిపోతుంది. మనుషులకు కొంచెం కూడా కనికరం లేకుండా ఎలా ఉంటారు అని బాధపడతారు ఈ సైకో బ్రదర్స్. అప్పటినుంచి దొరికిన వాళ్లను ఇలా హింసించి చంపుతూ ఉంటారు. ఈ క్రమంలో రెండు జంటలు వెళుతుండగా కారు ప్రాబ్లం వచ్చి ఆ ప్రాంతంలో ఆగిపోతుంది. అక్కడ వీళ్ళకి ఆ సైకోలు ఎదురవుతారు. ఘోరంగా ఒక్కొక్కరిని చంపుతారు సైకో బ్రదర్స్.
చంపిన శవాలను ముక్కలు చేస్తారు ఈ సైకో బ్రదర్స్. చివరికి ఒక అమ్మాయి మిగలగా, ఆమెను అక్కడే ఒకచోట భంధించి వున్న గర్భవతి అయిన ఒక అమ్మాయి దగ్గర పెడతారు. ఆమెకు కట్లు విప్పగానే తనకు తానే గొంతు కోసుకొని చచ్చిపోతుంది గర్భవతి. ఈ దృశ్యాలను చూసిన ఆ అమ్మాయి ఒక సైకో కిల్లర్ని చంపుతుంది. చివరికి ఈ అమ్మాయి అక్కడ నుంచి తప్పించుకుంటుందా ? మరో సైకో కిల్లర్ చేతిలో బలైపోతుందా? ఈ విషయాలను చూడాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బుట్చర్స్’ (Butchers) అనే వణుకు పుట్టించే ఈ సైకో కిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సైకో థ్రిల్లర్ మూవీలో హింస ఎక్కువగా ఉన్నందువలన, పిల్లలతో కలసి ఈ మూవీని చూడకండి.