BigTV English

Keerthy Suresh: ‘మహానటి’ సినిమాను రిజెక్ట్ చేయాలనుకున్న కీర్తి సురేశ్.. అదే కారణమా.?

Keerthy Suresh: ‘మహానటి’ సినిమాను రిజెక్ట్ చేయాలనుకున్న కీర్తి సురేశ్.. అదే కారణమా.?

Keerthy Suresh: కొన్ని సినిమాలు హీరోహీరోయిన్ల కెరీర్‌నే మార్చేస్తాయి. ఆ తర్వాత వారికి ఎన్ని హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా ఆ ఒక్క సినిమా మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అలా కీర్తి సురేశ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘మహానటి’. అప్పుడప్పుడే కెరీర్‌ను ప్రారంభించిన కీర్తి సురేశ్‌కు ‘మహానటి’ మూవీ అనేది జాక్‌పాట్‌లాగా తగిలింది. ఆ మూవీ తర్వాత చాలామంది తనను మహానటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) అని కూడా పిలవడం మొదలుపెట్టారు. ఆ రేంజ్‌లో తనకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ సినిమా. అలాంటి సినిమాను మొదట్లో తాను రిజెక్ట్ చేయాలనుకున్నానని తాజాగా బయటపెట్టింది కీర్తి. దాని వెనుక కారణం కూడా చెప్పుకొచ్చింది.


రిజెక్ట్ చేశాను

అప్పటివరకు కేవలం అప్‌కమింగ్ హీరోయిన్‌గా ఉన్న కీర్తి సురేశ్‌ను ఒక్కసారిగా స్టార్‌గా మార్చేసింది ‘మహానటి’ (Mahanati). ఒకప్పుడు ఇండస్ట్రీలో మహానటిగా వెలిగిపోయి, సౌత్‌లో తన పేరుపై రికార్డులు క్రియేట్ చేసిన సావిత్రి బయోపిక్ ఇది. దీనిని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. నాగ్ అశ్విన్ వచ్చిన కీర్తి సురేశ్‌కు 4 గంటలు కథ చెప్పిన తర్వాత కూడా తాను ‘మహానటి’ని రిజెక్ట్ చేయాలని అనుకున్నట్టు తాజాగా బయటపెట్టింది. ఇది విన్న తర్వాత అలాంటి ఆఫర్‌ను తాను ఎలా రిజెక్ట్ చేయాలనుకుంది అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కానీ దానికి కారణం కేవలం తన భయం మాత్రమే అని చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్. అందుకే తనకు రిజెక్ట్ చేయాలనే ఆలోచన వచ్చిందట.


Also Read: బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమయిన శ్రీలీల.. యంగ్ హీరోతో రొమాన్స్‌కు రెడీ

చాలా భయపడ్డాను

‘‘నాగ్ అశ్విన్ వచ్చి నాకు కథ చెప్పిన తర్వాత నేను సినిమా చేయడానికి నో చెప్పేశాను. నేను కచ్చితంగా ఓకే చెప్తానని నిర్మాతలు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. కానీ నాకు చాలా భయమేసింది అందుకే నో అన్నాను. నిర్మాతలు స్వప్న, ప్రియాంక షాకయ్యారు. ఏంటీ అమ్మాయి? సామిత్రమ్మ బయోపిక్‌లో నటించే అవకాశాన్ని కాదంటుంది ఏంటి.? అనుకున్నారు. కానీ నేను అది కేవలం భయంతోనే వద్దన్నాను. ఒక అమ్మాయి ఎక్కడి నుండో వచ్చి ఒక లెజెండ్‌పై బయోపిక్ చేస్తే ప్రేక్షకులు అది చూసి నేను దానిని సరిగ్గా చేయలేదని చెప్తే ఎలా అనే అనుకున్నాను. పాజిటివ్‌గా ఆలోచించలేకపోయాను. చాలా భయపడ్డాను’’ అని వివరించింది కీర్తి సురేశ్.

నమ్మకంతోనే ఒప్పుకున్నాను

‘‘మనం చాలా పర్సనల్ లైఫ్ చూపించాలి అని నాగ్ అశ్విన్ అన్నాడు. కానీ అది తన ఫ్యాన్స్‌కు నచ్చకపోతే ఎలా? దానిని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? వాళ్లు కాన్ఫిడెంట్‌‌గానే ఉన్నారు. నా మీద నాకు లేని నమ్మకం నాగ్ అశ్విన్‌కు ఉంది. అదే నన్ను ఈ సినిమా చేసేలా చేసింది’’ అంటూ ఫైనల్‌గా తాను ఒప్పుకోవడానికి కారణాన్ని చెప్పింది కీర్తి సురేశ్. తమిళంలో తన డెబ్యూ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాతలు తనను ఐరెన్ లెగ్ అని ముద్రవేశారని బయటపెట్టింది. అంతే కాకుండా పలువురు హీరోలతో తను రిలేషన్‌షిప్‌లో ఉందని చాలా రూమర్స్ వచ్చేవని, అవన్నీ కూడా అబద్ధాలే అని గుర్తుచేసుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×