OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అదరగొడుతుంది. ఓటీటీలోకి వచ్చే ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను చూస్తూ మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మూవీ లవర్స్ ని పిచ్చిగా ఎంటర్టైన్ చేస్తున్న ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ, ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amzon prime video) లో
ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మంకీ మాన్‘ (Monkey Man). 2024 లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. సికందర్ ఖేర్, షార్ల్టో కోప్లీ, పిటోబాష్ , విపిన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మంకీ మ్యాన్ ఏప్రిల్ 5, 2024న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ లో విడుదలైంది. ఈ మూవీకి విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు వచ్చాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amzon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక ఫైటర్ గా అవతారం ఎత్తుతాడు. గ్యాంబ్లింగ్ జరిగే ఈ ఫైటింగ్ లో, మంకీ మ్యాన్ వేషం వేసుకొని హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఈవెంట్ మేనేజర్ ఓడిపోతే కూడా డబ్బులు ఇస్తాను అని చెప్పడంతో, కొన్ని మ్యాచ్లు ఓడిపోతూ ఉంటాడు హీరో. హీరోకి తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన ఎక్కువగా బాధపెడుతుంది. ఇతని తల్లిని ఒక పోలీస్ ఆఫీసర్ చంపి ఉంటాడు. అతని మీద పగ తీర్చుకోవడానికి ఒక క్లబ్ లో జాయిన్ అవుతాడు హీరో. అక్కడ పనిచేసే వాళ్ళతో మంచిగా ఉంటూ, ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆ ఆఫీసర్ ని చావు అంచులు వరకు తీసుకువెళ్తాడు. అయితే అక్కడికి పోలీసులు రావడంతో, హీరో తప్పించుకుని వెళ్తాడు. అలా వెళ్తున్న ఇతడు ఒక వేశ్య గృహంలోకి వెళ్తాడు. అక్కడికి కూడా ఇతన్ని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు.
అక్కడినుంచి తప్పించుకొని నీళ్లలో పడిపోతాడు హీరో. ఆ తర్వాత ఒక స్వామి దగ్గర కళ్ళు తెరుస్తాడు. ఆ ప్రాంతం అంతా సాధువులతో నిండి ఉంటుంది. అతనికి ఒక ఆకు మందు ద్వారా చాలా శక్తి ఇస్తాడు అక్కడున్న ఒక స్వామి. ఆ స్వామి ఇచ్చే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. చివరికి హీరో ఆశక్తి ద్వారా తన తల్లిని చంపిన వాళ్లను హతమారుస్తాడా? హీరో మళ్ళీ ఏమైనా చిక్కుల్లో పడతాడా? అతనికి వచ్చిన అంతులేని శక్తితో ఇంకా ఏమేమి చేస్తాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘మంకీ మాన్’ (Monkey man) అనే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.