OTT Movie : మలయాళం సినిమాలకు, తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్లాల్ పేర్లు తప్ప ఏమీ తెలియని ప్రేక్షకులు, ఇప్పుడు ఆ సినిమాల దర్శకుల పేర్లతో పాటు, అన్ని విషయాలు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ప్రేమికులకు సహాయం చేస్తానని చెప్పి, వాళ్లను మోసం చేసే వ్యక్తి చుట్టూ మూవీ స్టోరి తిరుగుతుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘చోళ‘ (Chola). ఈ మూవీకి సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జోజు జార్జ్ నిర్మించగా, షాజీ మాథ్యూ, అరుణా మాథ్యూ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీలో జోజు జార్జ్, నిమిషా సజయన్, అఖిల్ విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రవి అతని బాస్ తో కలిసి, తన లవర్ సంధ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అనుకున్న సమయానికి సంధ్య వీళ్ళ దగ్గరికి వస్తుంది. నిజానికి వీళ్లిద్దరూ సిటీ కి వెళ్లి సరదాగా గడపాలనుకుంటారు. సాయంత్రం లోగా ఇంటికి వెళ్లాలనుకుంటుంది. రవి తన ఓనర్ ని కూడా పిలుచుకు రావడంతో, సంధ్య భయపడుతూ ఉంటుంది. తన బాస్ మంచివాడని సంధ్య కి ధైర్యం చెప్తాడు రవి. సంధ్యకి అతని మీద అనుమానంగానే ఉంటుంది. అలా వీళ్లు సిటీకి వెళ్లి సరదాగా గడుపుతారు. ఈ విషయం సంధ్య తల్లికి తెలిసి పోయిందని ఫోన్ వస్తుంది. అయితే ఇప్పుడు ఊరికి వెళ్లడం మంచిది కాదని, లాడ్జిలో రూమ్ తీసుకుంటారు. రవిని ఫుడ్ తీసుకురమ్మని పంపించి, సంధ్య పై ఆఘాయిత్యం చేస్తాడు ఓనర్. తిరిగి వచ్చిన రవికి ఈ విషయం తెలిసి బాధపడతాడు.
అయితే ఊరికి సంధ్యని పిలుచుకు పోవడానికి, అతడు తప్ప వేరే దిక్కు లేకుండా ఉంటుంది. ఆతరువాత వీళ్ళు ముగ్గురు కలసి ఊరికి బయలుదేరుతారు. మధ్యలోనే అడవి ప్రాంతంలో సంధ్య నేను ఊరికి రాలేనంటూ, జీపులో నుంచి దిగి అక్కడే ఉండిపోతుంది. ఈలోగా ఓనర్ మరొక్కసారి ఆమెపై బలాత్కారం చేస్తాడు. అలా చేసినా విచిత్రంగా అతని చుట్టూనే ఏడుస్తూ తిరుగుతుంది సంధ్య. ఇది చూసిన రవి, ఓనర్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి సంధ్య పరిస్థితి ఏమవుతుంది? రవి తనని మోసం చేసిన ఓనర్ ని చంపుతాడా? ఓనర్ చుట్టూ సంధ్య ఎందుకు తిరుగుతూ ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘చోళ’ (Chola) అనే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.