OTT Movie : కొరియన్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ సినిమాలను మన వాళ్ళు ఆదరిస్తున్నారు. అయితే ఈ మధ్య వీటిని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కొరియన్ సిరీస్ లను చూపు తిప్పుకోకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక భార్య మరొకరిని పెళ్లి చేసుకుంటానని భర్తనే అడుగుతుంది. ఆడగడమే కాదు, ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తుంది. దీంతో ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మై వైఫ్ గాట్ మ్యారీడ్’ (My Wife Got Married) ఒక కొరియన్ రొమాంటిక్ సినిమా. జెంగ్ యూన్-సూ దర్శకత్వంలో సన్ యే-జిన్, కిమ్ జూ-హ్యుక్, జూ సాంగ్-వుక్ఉ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008 అక్టోబర్ 23న కొరియాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
డోక్ అనే యువకుడికి ఫుట్‌బాల్ ఆటను ఎక్కువగా అభిమాణిస్తుంటాడు. దీంతో పెద్దయ్యాక కూడా అతను ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేస్తుంటాడు. ఈ సమయంలో అతను ఇన్ అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమెకు కూడా ఫుట్‌బాల్ ఆట అంటే ఇష్టం ఉండటంతో ఇద్దరూ మాటలు కలుపుతారు. ఆతరువాత చేతులు కూడ కలుపుతారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని దగ్గరవుతారు. ఇక పెళ్లి తర్వాత వాళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక రోజు ఇన్ ఇచ్చే షాకింగ్ ట్విస్ట్ కి డోక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆమె జే అనే మరో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవాలని చెప్తుంది.
Read Also : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్