E-Paper
Advertisement

Horoscope  Today February 7th: ఈరోజు ఆ రెండు రాశుల వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి

Horoscope  Today February 7th: ఈరోజు ఆ రెండు రాశుల వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 7న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే చాన్స్‌ ఉంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

మిధున రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు, వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

https://www.bigtvlive.com/devotional/simple-remides-for-big-problems.html

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి  ఉద్యోగస్థులకు ఈరోజు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు బంధు, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×