OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు ఈ సినిమాలంటే బాగా ఇష్టపడతారు. భయపెట్టిస్తూ ఎంటర్టైన్ చేసే సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి హారర్ థ్రిల్లర్ సినిమాలు మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో తోటి ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. గోడల్లో బంధించిన ఒక ఆత్మ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ చూడాలంటే గుండె జారిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కాబ్‌వెబ్’ (Cobweb). 2023 లో వచ్చిన ఈ మూవీకి సామ్యూల్ బోడిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక చిన్న పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. అతని ఇంటి గోడల్లో నుండి వచ్చే రహస్యమైన శబ్దాలను కనిపెట్టే ప్రయత్నంలో స్టోరీ ముందుకు వెళ్తుంది. ఇందులో లిజ్జీ కాప్లాన్, ఆంటోనీ స్టార్, క్లియోపాత్రా కోల్‌మన్, వుడీ నార్మన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
పీటర్ అనే ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులైన కరోల్, మార్క్ తో కలిసి ఒక పాత ఇంట్లో నివసిస్తాడు. పీటర్ ఎక్కువగా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటాడు. అందువల్లే బయటి పిల్లలు ఇతన్ని ఆట పట్టిస్తుంటారు. అతని జీవితంలో ఏకైక సానుభూతి చూపే వ్యక్తి అతని టీచర్ మిస్ డివైన్ మాత్రమే. ఒక రాత్రి, పీటర్ తన పడకగది గోడల్లో నుండి వచ్చే వింత శబ్దాలను వింటాడు. అవి వినడానికి కొంచెం భయంకరంగా ఉంటాయి. అతను ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్తాడు. కానీ వారు దానిని అతని ఊహ మాత్రమే అని చెప్పి కొట్టిపారేస్తారు. ఆ తరువాత హాలోవీన్ సమీపిస్తున్నప్పుడు, పీటర్ ట్రీటింగ్‌కు వెళ్లాలని కోరుకుంటాడు. కానీ అతని తల్లిదండ్రులు, పొరుగున ఒక అమ్మాయి అదృశ్యం కారణంగా అతన్ని పంపించరు. ఆ తరువాత ఆ ఇంట్లో శబ్దాలు మరింత తీవ్రమవుతాయి. పీటర్‌కు తన తల్లిదండ్రులు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారనే అనుమానం కలుగుతుంది.
ఈ శబ్దాల వెనుక ఒక స్వరం ఉందని, అది అతనితో మాట్లాడుతుందని అతను కనిపెడతాడు. అది అతని సోదరి సారా అని పీటర్ తో చెప్పుకుంటుంది. ఆమెను తల్లిదండ్రులు గోడల్లో బంధించారని వెల్లడిస్తుంది. పీటర్ ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ కథలో ఊహించని మలుపు తిరుగుతుంది. సారా నిజంగా ఎవరు ? ఆమెను ఎందుకు బంధించారు ? అనే విషయం వెల్లడవుతుంది. ఆమె ఒక సాధారణ మనిషి లా కాకుండా, ఒక భయంకరమైన కదిలే సాలెపురుగులా ఉంటుంది. పీటర్ తన తల్లిదండ్రులను ఎదిరించి, సారాను విడుదల చేస్తాడు. కానీ ఆమె అతని ఊహలకు మించిన ప్రమాదకరమైనదని అపుడే తెలుసుకుంటాడు. అది బయటకు వచ్చిన తరువాత చాలా ప్రమాదకరంగా మారుతుంది. మిస్ డివైన్ కూడా పీటర్‌ను కాపాడే ప్రయత్నంలో చిక్కుకుంటుంది. చివరికి సారా ఒక రాక్షస జీవిగా మారడానికి కారణం ఎవరు ? పీటర్ తో పాటు, మిగతావాళ్ళు సారా నుంచి తప్పించుకుంటారా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే.