Pradeep Machiraju: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వాళ్ళ మధ్య ప్రేమ, పెళ్లిళ్లు అనేవి కామన్. అయితే కొందరు మాత్రం పెళ్లి వయసు దాటి పోతున్నా కూడా పెళ్లి చేసుకోరు. దాంతో ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. అలాంటి వారిలో ముందుగా వినిపించేది హీరో ప్రభాస్ పేరు. ఆ తర్వాత బుల్లితెర యాంకర్ ప్రదీప్. బుల్లితెరపై అనేక షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇదే సమయంలో అడపా దడపా సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు. అయితే ఈ స్టైలిష్ యాంకర్ పెళ్లి గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రదీప్ పెళ్ళెప్పుడు? అనే ప్రశ్న వదల్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటు కామెంట్స్ పెడుతున్నారు.. ఆయన ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..
Also Read :రాంప్రసాద్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన సుమ.. లైవ్ లోనే దండం పెట్టేశాడు..
మూవీ ప్రమోషన్..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రదీప్ మాచిరాజు.. ఈయన బుల్లితెర పై టాప్ మేల్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. ఒకప్పుడు వరుస షోలకు వ్యాఖ్యాతగ వ్యవహారిస్తూ జనాలను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించాడు. అయితే సినిమాల్లో చిన్న రోల్లో కనిపించిన ప్రదీప్ ఇటీవల హీరో అయ్యాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే మూవీతో హీరో అయ్యాడు. ఆ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దాంతో మళ్లీ బుల్లి తెర పై బిజీ అయ్యాడు. ఇన్నాళ్లకు మరో మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా వాళ్ళ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రమోషన్స్ లో జోరును పెంచారు ప్రదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రదీప్ సినిమాతో పాటు పెళ్లి పై కూడా క్లారిటీ ఇచ్చాడు..
పెళ్లి పై ప్రదీప్ క్లారిటీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రదీప్ మాచిరాజు తన సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక బుల్లితెరపై షోలకు గుడ్ బై చెప్పేస్తారని అడిగితే.. అది మన చేతుల్లో ఉండేది కాదు అటు చేస్తాను ఇటు చేస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. చివరగా ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అనే విషయం గురించి సోషల్ మీడియాలో పెడితే చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది? అసలు ప్రదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని యాంకర్ అడిగారు. దానికి ప్రదీప్ ఆలోచన వచ్చింది త్వరలోనే మీకు ఆ న్యూస్ మీకు చెప్తాను అని చెప్పాడు. అయితే అమ్మాయి ఎవరు అనేది బయట పెట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎమ్మెల్యే అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ప్రదీప్ పెళ్లి గురించి అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే..
ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. మరోపక్క యాంకర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్‌లో టాప్ మేల్ యాంకర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా చేశారు. ఇప్పుడు రెండో సినిమాగా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..