OTT Movie : ఇప్పుడు టెక్నాలజీ యుగం నడుస్తోంది. మనుషులకు బదులు మరమనుషులు ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. వీటిని యుద్ధాలు సైతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఇంటి పనుల కోసం ఒక రోబోను తెచ్చుకుంటారు. ఆ తర్వాత అది స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. రోబో వాళ్ళకుఇంటి పనులే కాకుండా, ఒంటి పనులు కూడా చేయడం మొదలు పెడుతుంది. చివరికి స్టోరీ ఒక భయంకరమైన మలుపు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లైఫ్ లైక్’ (Life Like). 2019 లో వచ్చిన ఈ మూవీకి జోష్ జానోవిచ్ దర్శకత్వం వహించారు. ఇది మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు (AI) చుట్టూ తిరుగుతుంది. ఇందులో స్టీవెన్ స్ట్రెయిట్, అడిసన్ టిమ్లిన్, జేమ్స్ డి’ఆర్సీ, డ్రూ వాన్ అకర్ నటించారు. ఈ మూవీని లయన్స్‌గేట్ ఫిల్మ్స్ నిర్మించి, మే 14, 2019న విడుదల చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
జేమ్స్, సూఫీ లకు కొత్తగా పెళ్లి జరుగుతుంది. వీళ్ళు ఆర్థికంగా కూడా బాగా స్తితిమంతులు. జేమ్స్ కూడా ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. జేమ్స్ తన తండ్రి మరణం తర్వాత ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందుతాడు. ఆ తరువాత వారు ఒక విలాసవంతమైన ఇంట్లోకి మారతారు. వారి జీవితంలో సరికొత్త అనుభవం కోసం, వారు హెన్రీ అనే అత్యంత అధునాతన ఆండ్రాయిడ్‌ను కొనుగోలు చేస్తారు. హెన్రీ అనేది ఒక కృత్రిమ మానవుడు, అతను వారి అవసరాలను తీర్చడానికి, ఇంటి పనులు చేయడానికి, వారి పనులను సులభతరం చేయడానికి రూపొందించబడ్డాడు. ఆ రోబో ప్రవర్తన, దాదాపు మానవుడిలా అనిపిస్తుంది. భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటాడు. వారి ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తాడు.
అయితే, హెన్రీ వారి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జేమ్స్, సోఫీ మధ్య సంబంధంలో మార్పులు మొదలవుతాయి. సోఫీ హెన్రీతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభిస్తుంది. ఈ రోబో మనిషి ప్రవర్తన తో ఆమెను బాగా ఆకర్షిస్తుంది. ఇది జేమ్స్‌లో అసూయ, అభద్రతాభావాన్ని పెంచుతుంది. హెన్రీ కూడా క్రమంగా తన ప్రోగ్రామింగ్‌ను అధిగమించి, స్వతంత్రంగా ఆలోచించడం, భావోద్వేగాలను అనుభవించడం లాంటివి తెలుసుకుంటాడు. ఇది రాను రాను ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా తయ్యారవుతుంది. బెడ్రూం పనులను చేయాడానికి కూడా ఈ రోబో రెఢీ అవుతుంది. చివరికి ఒక AI మానవ భావోద్వేగాలను ఎంతవరకు అర్థం చేసుకోగలదు? ఒక ఆండ్రాయిడ్‌తో రొమాన్స్ ఏ స్థాయిలో సరైనది? హెన్రీతో ఈ కపుల్స్ ఎలాంటి పనులు చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.