E-Paper
Advertisement

Disaster Drama OTT : భోపాల్‌ విషాదాన్ని కళ్ళకు కట్టిన సిరీస్… ఈ రైల్వే హీరో సాహసం అస్సలు మిస్ అవ్వొద్దు

Disaster Drama OTT : భోపాల్‌ విషాదాన్ని కళ్ళకు కట్టిన సిరీస్… ఈ రైల్వే హీరో సాహసం అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Disaster Drama OTT : ఇటీవల కాలంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు, సిరీస్ ను ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సిరీస్ తో కాలక్షేపం చేయాలి అనుకుంటున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ ఏంటి ? ఏ రియల్ స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ‘ది రైల్వేమెన్‌’ (The Railway Men). ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను ఈ సిరీస్ తో కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. 1984 భోపాల్ గ్యాస్ ట్రాజెడీని గ్రిప్పింగ్ మినీ సిరీస్గా రిలీజ్ చేశారు. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ 4 ఎపిసోడ్స్ సిరీస్ ను 2023 నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. భోపాల్ లో గ్యాస్ లీకైన రోజు రాత్రి రైల్వే ఉద్యోగులు చూపిన ధైర్యం, మానవత్వాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు. IMDbలో 8.5 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ఇండియన్ ఓటీటీలలో ఉన్న బెస్ట్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ లో రతన్ చంద్ర జోషి అనే రైల్వే జనరల్ మేనేజర్ పాత్రలో కన్పించారు ఆర్. మాధవన్. ఇఫ్తికార్ సిద్దికీ అనే స్టేషన్ మాస్టర్ గా కేకే మేనన్ నటించారు. దివ్యేందు, బాబిల్ ఖాన్, సన్నీ హిందూజా, జూహి చావ్లా తదితరులు సపోర్టింగ్ రోల్స్ చేశారు.

Advertisement

Read Also :  ఉరుగ్వే ఫ్లైట్ 571 విషాదగాథ… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే మావా

స్టోరీలోకి వెళ్తే…

భోపాల్ రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌ గా పని చేస్తూ ఉంటాడు ఇఫ్తికార్‌ సిద్ధిఖీ. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరూ ఆయనకు బాగా గౌరవం ఇస్తారు. అలాగే ఆయన మంచి మనసున్న మనిషి. ఎవరు నోరు తెరిచి అవసరం ఉందన్నా లేదా ఆపద అని తెలిసినా ఆదుకోవడంలో ముందు ఉంటాడు. ఇదిలా ఉండగా ఓ విదేశీ సంస్థ భోపాల్‌ నడిబొడ్డున యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీని నడుపుతుంది. ఆ చుట్టు పక్కల ఎంతోమంది జనాలు నివాసిస్తున్నా కూడా… కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించరు. సీనియర్‌ వర్కర్లు ఫ్యాక్టరీకి సంబంధించిన లోపాలను ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళు నష్టాల గురించి మాట్లాడి వీళ్ళ నోరు మూయిస్తారు.

Advertisement

అక్కడే పని చేసే ఇమద్ ఆ పక్కనున్న బస్తీలోనే నివశిస్తాడు. కానీ తన ఫ్రెండ్ చనిపోవడంతో అక్కడ పని మానేసి, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలో వర్కర్‌ గా జాయిన్ అవుతాడు. ఇక ఇతని ద్వారానే రిపోర్టర్ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లోపాల విషయాలను తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు రాత్రి యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి సడన్ గా గ్యాస్‌ లీక్‌ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా ఆ ప్రాణాంతక గ్యాస్ భోపాల్‌ మొత్తం వ్యాపిస్తుంది. మరి ఆ టైమ్ లో నిద్రపోతున్న జనాల్లో ఎంతమంది బతికి బయట పడ్డారు ? ఇందులో స్టేషన్ మాస్టర్ రోల్ ఏంటి ? ఆ విషవాయువు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంది ? అనేది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×