OTT Movie : సైకో స్టోరీలతో వచ్చే సినిమాలు విభిన్న శైలి తో నడుస్తుంటాయి. సస్పెన్స్, వైలెన్స్ తో పిచ్చెక్కిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఏడేళ్ల పాపను ఒక జంట దత్తత తీసుకుంటుంది. అయితే ఆ పాప నుంచి, ఆ ఫ్యామిలీకి అనుకోని సమస్యలు వస్తాయి. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
హులు (Hulu)
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గుడ్ అమెరికన్ ఫ్యామిలీ’ (Good American Family). ఇది నిజ జీవితంలో జరిగిన నటాలియా గ్రేస్ అనే అమ్మాయి అడాప్షన్ కథ ఆధారంగా రూపొందింది. ఈ స్టోరీ హులు (Hulu) ప్లాట్ ఫామ్‌లో మార్చి 19, 2025 నుంచి ప్రీమియర్ అయింది. ఇది క్రిస్టిన్ బార్నెట్, మైఖేల్ బార్నెట్ అనే దంపతుల చుట్టూ తిరుగుతుంది. వీరు నటాలియా గ్రేస్ అనే ఒక ఉక్రేనియన్ అనాథ బాలికను దత్తత తీసుకుంటారు. ఏడు సంవత్సరాల నటాలియాకు (SEDc) అనే అరుదైన డిసీస్ ఉందని తెలుస్తుంది. ఆమె వయస్సు 7 సంవత్సరాలని అనుకుంటారు. కాని అక్కడే వాళ్ళు పప్పులో కాలు వేస్తారు. నటాలియా వచ్చాక వాళ్ళకు అసలు సమస్యలు మొదలవుతాయి.
స్టోరీలోకి వెళితే
క్రిస్టిన్, మైఖేల్ దంపతులకు ముచ్చటగా ముగ్గురు పిల్లలు ఉంటారు. అయినాగాని నటాలియా అనే 7 సంవత్సరాల అమ్మాయిని దత్తత తీసుకుంటారు. క్రిస్టిన్ ఒక మంచి తల్లిగా, ఆటిజం ఉన్న తన కుమారుడు జాకబ్‌ను సాధారణ జీవితంలోకి తీసుకొస్తుంది. నటాలియాను దత్తత తీసుకున్న తర్వాత, ఆమె ప్రవర్తనలో మార్పులు కనిపించడం మొదలవుతుంది. ఈ దంపతులు ఆమె వయస్సు, నేపథ్యం గురించి సందేహాలు పెంచుకుంటారు. ఆమె నిజంగా 7 ఏళ్ల బాలిక కాదని, బహుశా పెద్ద వయస్సు వ్యక్తి అయి ఉండవచ్చని భావిస్తారు. నటాలియా తమ కుటుంబానికి ముప్పు తెచ్చే వ్యక్తిగా మారుతుందని ఆ దంపతులు భావిస్తారు. ఆమె వాళ్ళకు సైకోపాత్ గా అనిపిస్తుంది. ఆ అమ్మాయిపై కోర్ట్ కి కూడా వెళతారు. నటాలియా తమ పిల్లలను హాని చేయడానికి ప్రయత్నించిందని, తమను చంపేందుకు కాఫీలో విషం కూడా కలిపిందని ఆరోపణలు చేస్తారు.
మరోవైపు నటాలియా తన వాదనలో, తాను నిజంగా బాలికనని చెప్తుంది. తనను అనుమానించి, బార్నెట్ దంపతులు తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆరోపిస్తుంది. ఈ సంఘటనల తర్వాత, క్రిస్టిన్ దంపతులు నటాలియా వయస్సును 8 నుండి 22 సంవత్సరాలకు మార్చేందుకు కోర్టును ఆశ్రయిస్తారు. ఆ తర్వాత, వారు ఆమెను ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వదిలి, తమ ముగ్గురు పిల్లలతో కెనడాకు వెళ్లిపోతారు. నటాలియాను వదిలేసిన తర్వాత, ఆమెను సింథియా, ఆంట్వన్ మాన్స్ అనే దంపతులు తమ 10 మంది పిల్లలతో కలిసి నటాలియాను దత్తత తీసుకుంటారు. చివరికి అక్కడ కూడా నటాలియా సైకో లా ప్రవర్తిస్తుందా ? నిజంగానే ఆమెకు వయసు పెద్దగా ఉంటుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.