OTT Movie : ఎరోటిక్ థ్రిల్లర్స్ యూత్ ఫుల్ స్టీమీ సీన్స్, డ్రామాటిక్ ట్విస్ట్స్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. కానీ కొన్ని సినిమాలు వివాదాస్పద థీమ్స్‌తో చర్చలకు కారణమవుతాయి. మీకు అలాంటి ఒక ఇంటెన్స్, కానీ కాంట్రవర్షియల్ యూత్ ఫుల్ థ్రిల్లర్ కావాలా? అందులో మాఫియా, కిడ్నాపింగ్, లవ్ వంటి కంటెంట్ ఉంటే చూడడానికి ఇంకా బాగుంటుంది కదా. అలాంటి మూవీనే ఇది కూడా. ఇంతకీ ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం రండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ ఇంటెన్స్ మసాలా మూవీ పేరు ‘365 Days’. బార్బరా బియలోవాస్ అండ్ టోమస్జ్ మాండెస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2020లో పోలండ్‌లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 2020లోనే నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అయింది. ఇందులో అన్నా-మారియా సీక్లూకా (లారా), మిషెల్ మోరోన్ (మాస్సిమో), బ్రోనిస్లా వ్రోక్లావ్స్కీ (మారియో), మాగ్డలీనా లాంపర్స్కా (ఓల్గా) తదితరులు నటించారు. ఈ సినిమా $9 మిలియన్ బాక్సాఫీస్ కలెక్షన్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ హిట్ గా నిలిచింది. కానీ ఆ టైపు వయోలెన్స్, గ్లామరైజేషన్ కారణంగా తీవ్ర వివాదాస్పదం అయ్యింది. బ్లాంకా లిపిన్స్కా రాసిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇందులో మసాలా సీన్లు గట్టిగానే ఉంటాయి. కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, సింగిల్ గా చూడడం బెటర్.
కథలోకి వెళ్తే…
బీల్ (అన్నా-మారియా సీక్లూకా) అనే వార్సా (పోలండ్) మహిళ కథతో మూవీ మొదలవుతుంది. లారా ఒక సేల్స్ డైరెక్టర్. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ అయినప్పటికీ, తన బాయ్‌ఫ్రెండ్ మార్టిన్ (మాటెస్జ్ లాసోవ్స్కీ)తో ఉన్న రిలేషన్‌షిప్‌లో ప్యాషన్ లేకపోవడంతో అసంతృప్తిగా ఉంటుంది. తన 29వ బర్త్‌డే సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌ను సేవ్ చేసుకోవాలనే ఆశతో, ఆమె మార్టిన్ స్నేహితులతో కలిసి సిసిలీ (ఇటలీ)కి ట్రిప్‌కు వెళ్తుంది. అయితే, అక్కడ ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.
సిసిలియన్ మాఫియా ఫ్యామిలీకి చెందిన యంగ్ అండ్ హ్యాండ్సమ్ బాస్ మాస్సిమో టోరిసెల్లి… ఐదు సంవత్సరాల క్రితం తన తండ్రి హత్య సమయంలో లారాను ఒక బీచ్‌లో చూస్తాడు. అప్పుడు అతను కూడా గాయపడతాడు. ఆ సమయంలో ఆమెను చూసినప్పటి నుండి మాస్సిమో ఆమె పట్ల ఒక ఆబ్సెషన్‌ను డెవలప్ చేస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత లారా ఎయిర్‌పోర్ట్‌లో కనబడడంతో ఆమెను కిడ్నాప్ చేస్తాడు. 365 రోజుల పాటు బందీగా ఉంచి, తనతో ప్రేమలో పడేలా చేస్తానని మాస్సిమో తన విల్లాలో లారాకు చెబుతాడు.
ఒకవేళ ఆమె ప్రేమలో పడకపోతే, ఆమెను విడిచిపెడతానని ప్రామిస్ చేస్తాడు. అతను ఆమెకు లగ్జరీ లైఫ్‌స్టైల్, డిజైనర్ బట్టలు, మంచి ఎన్విరాన్‌మెంట్‌ను ఆఫర్ చేస్తాడు. కానీ అనుమతి లేకుండా ఆమెను టచ్ చేయనని ప్రామిస్ చేస్తాడు. అయినప్పటికీ అతని డామినేటింగ్ బిహేవియర్, మాఫియా లైఫ్ ఆమెను భయపెడతాయి. లారా మొదట మాస్సిమోను రిజెక్ట్ చేస్తుంది. కానీ అతని చార్మ్, లగ్జరీ, ఇంటెన్స్ లుక్ ఆమెను ఆకర్షిస్తాయి. సినిమాలోని ఐకానిక్ యాచ్ సీన్, ఇతర స్టీమీ సీన్స్, “ఆర్ యు లాస్ట్, బేబీ గర్ల్?” వంటి క్రింజీ డైలాగ్స్ కథను మరింత ఇంటెన్స్ చేస్తాయి. ఇక ఎట్టకేలకు హీరోయిన్ ఆ మాఫియా డాన్ కు పడిపోతుంది. కానీ చివరికి ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అసలు హీరోయిన్ ను అతను ఎలా పడేశాడు? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? హీరోయిన్ మాఫియా గ్యాంగ్ వార్ కు ఎలా కారణం అయ్యింది? అనేది తెరపై చూడాల్సిందే.