Heroine Sangeeta:”ఒక్క ఛాన్స్ . ఒకే ఒక్క ఛాన్స్” అంటూ అమాయకత్వంతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది సంగీత (Sangeeta ). కృష్ణవంశీ (Krishna Vamshi) దర్శకత్వంలో రవితేజ (Raviteja ), శ్రీకాంత్ (Srikanth), ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఖడ్గం’. ఇందులో రవితేజకి జోడిగా నటించింది. ఇందులో తన అమాయకత్వంతో.. సినిమాలలో అవకాశం కోసం పాకులాడే అమ్మాయిగా చాలా అద్భుతంగా నటించింది. ఈ ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న సంగీత వరుసగా తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు అందుకుంది.
రీ ఎంట్రీలో బిజీగా మారిన సంగీత..
ఇక మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పోషిస్తున్న ‘పరదా’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఇటీవల 90’స్ హీరోయిన్స్ అందరూ కలిసి గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకొని మరీ తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా విడాకులు తీసుకోబోయే ముందు ఇంస్టాగ్రామ్ లో తమ పేరును మార్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ సంగీత..
ఇప్పుడు సంగీత కూడా అలా చేయడంతో విడాకుల రూమర్లు మొదలయ్యాయి. దీనికి తోడు సంగీతం తన ఇన్స్టాలో పేరు తొలగించడంతో విడాకులు తీసుకోబోతోంది అంటూ ఒక వార్త పెద్ద ఎత్తున గుప్పుమంది. అసలు విషయంలోకి వెళ్తే.. 2009లో ప్రముఖ సింగర్ క్రిష్ ను సంగీత వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇన్స్టాలో ఇన్ని రోజులు ‘సంగీత క్రిష్’ అని కనిపించేది. ఇప్పుడు కేవలం అది ‘సంగీత యాక్టర్’ అని మాత్రమే కనిపిస్తోంది. దీంతో సంగీత కూడా త్వరలోనే విడాకులు ప్రకటన ఏమైనా చేస్తుందని అందరూ అనుకుంటున్న వేళ సంగీత స్పందించింది.
విడాకుల రూమర్స్ పై స్పందించిన సంగీత..
సంగీత మాట్లాడుతూ.. “విడాకులు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. నేను మొదటి నుంచి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో నా పేరును సంగీత యాక్టర్ గానే ఉంచుకున్నాను. ఇది ఇప్పటికీ అలాగే ఉంది. మా ఆయనతో కలిసి నేను సంతోషంగా జీవిస్తున్నాను. ఈ రూమర్లపై స్పందించాల్సిన అవసరం లేదు కానీ.. మీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు కదా.. అందుకే స్పందించాల్సి వచ్చింది” అంటూ సంగీత క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే విడాకుల రూమర్స్ పై స్పందించి ఒక్క దెబ్బతో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
సంగీత సినిమాలు..
సంగీత కెరియర్ విషయానికి వస్తే..అసలు పేరు రసిక. ఇండస్ట్రీలోకి వచ్చాక సంగీతగా పేరు మార్చుకుంది. 1993లో వచ్చిన ‘ఆశల సందడి’ సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. డబుల్, నవ్వుతూ బ్రతకాలిరా, మా ఆయన సుందరయ్య వంటి చిత్రాలు చేసింది. కానీ ఖడ్గం సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈమె.. ఆ తర్వాత పెళ్ళాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, నేను పెళ్లికి రెడీ, కారా మజాకా ఇలా దాదాపు చాలా చిత్రాలలో నటించింది సంగీత.
ALSO READ:Allu Arha: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!