OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక భాష అనే అడ్డు గోడలను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అలా భాష అడ్డుగోడ కాదు అనుకునేవారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇదొక ఫ్రెంచ్ యూత్ ఫుల్ మాస్ మసాలా మూవీ. ఫ్రెంచ్ సినిమాలు విభిన్న కథలు, హై-ఎనర్జీ యాక్షన్, అనూహ్య ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటాయి. అందులోని అలాంటి సీన్లు ఉన్న సినిమాను చూడాలనుకుంటే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
డైరెక్టర్ జూలియన్ హాలండే రూపొందించిన ఈ ఫ్రెంచ్ ఫిల్మ్ పేరు All-Time High (2023) (ఒరిజినల్ టైటిల్: Nouveaux Riches), ఈ సినిమా ఒక కాన్ ఆర్టిస్ట్, క్రిప్టో మిలియనీర్ మధ్య జరిగే క్రేజీ రైడ్. నెట్‌ఫ్లిక్స్ ఫ్రాన్స్ నిర్మించిన ఈ మూవీ 2023 నవంబర్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ (Netflix)లోనే అందుబాటులో ఉంది. నస్సిమ్ లైస్ (యూసెఫ్), జో మార్చల్ (స్టెఫానీ), ఆడ్రియన్ ఎస్సామిర్ “సికారియో”, యూసెఫ్ రమల్, యోవెల్ లెకోవ్స్కీ, యస్సీన్ స్టెయిన్, సిరిల్ గానే (కామియో) ఇందులో నటించారు. ఇంగ్లీష్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
మూవీ యూసెఫ్ (నస్సిమ్ లైస్) అనే కాన్ ఆర్టిస్ట్ కథతో మొదలవుతుంది. యూసెఫ్, అప్పుల్లో కూరుకుపోయి, తన గర్ల్‌ఫ్రెండ్ స్టెల్లా (కెంజా ఫోర్టాస్) కోసం లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను నటించడానికి చిన్న చిన్న స్కామ్‌లు చేస్తూ ఉంటాడు. అతను నకిలీ రోలెక్స్ వాచ్‌లు, డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌లు అమ్ముతూ, తన గుర్తింపును దాచడానికి విగ్‌లు ధరిస్తాడు. అయితే అతని అబద్ధాలు బయటపడినప్పుడు, స్టెల్లా అతన్ని విడిచిపెట్టడంతో, అతను మరింత డెస్పరేట్ అవుతాడు. ఒక అండర్‌గ్రౌండ్ పోకర్ గేమ్‌లో, యూసెఫ్ స్టెఫానీ (జో మార్చల్) అనే న్యూరోటిక్ క్రిప్టోకరెన్సీ మిలియనీర్‌ను కలుస్తాడు.
స్టెఫానీ తన స్మార్ట్‌నెస్, కామెడీ టైమింగ్ తో యూసెఫ్‌ను ఆటపట్టిస్తూ, అతని గేమ్‌ను నాశనం చేస్తుంది. ఈ గేమ్‌లో యూసెఫ్ అప్పుల్లో మునిగిపోతాడు. అతన్ని మాఫియా బ్రదర్స్ (యూసెఫ్ రమల్, ఆడ్రియన్ ఎస్సామిర్) బెదిరించడంతో… యూసెఫ్, స్టెఫానీ క్రిప్టో వెల్త్‌ను స్కామ్ చేసి తన అప్పులు తీర్చాలని ప్లాన్ చేస్తాడు. ఆమెను తన “డ్రీమ్ టార్గెట్”గా భావిస్తాడు. అయితే స్టెఫానీ కూడా ఒక స్కామర్ అని, ఆమె అతన్ని ఆడుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఒక క్లబ్‌లో వారిద్దరూ మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఒక కాజువల్ నైట్‌కు దారితీస్తుంది. ఈ ఇద్దరు స్కామర్స్ మధ్య ఒక అన్‌కన్వెన్షనల్ రొమాన్స్ మొదలవుతుంది. అది ఊహించని ట్విస్ట్‌లతో నిండి ఉంటుంది. సినిమా హై-ఎనర్జీ ఫైట్ సీన్స్‌తో, బోన్-క్రాకింగ్ కొరియోగ్రఫీతో, కామెడీతో ముందుకు సాగుతుంది. మరి ఇంతకీ చివరికి ఎవరిని ఎవరు మోసం చేశారు? అనుకున్నట్టుగానే హీరో తన అప్పులు తీర్చుకున్నాడా? చివరికి ఏమైంది ? అన్నది స్టోరీ.