BigTV English

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : ఓటీటీలో మంచి ఎరోటిక్ థ్రిల్లర్స్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే. మసాలా సీన్స్ తో పాటు సైకలాజికల్‌గా ఇంటెన్స్ థ్రిల్లర్ కావాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో సస్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో
ఈ అమెరికన్ థ్రిల్లర్ పేరు ‘In the Cut’. 119 నిమిషాల ఈ ఫిల్మ్ జేన్ కాంపియన్ దర్శకత్వంలో, సుసన్నా మూర్ నవల ఆధారంగా, స్క్రీన్‌జెమ్స్ నిర్మాణంలో రూపొందింది. 2003లో రిలీజైన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హులు, MUBI ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఈ మూవీలో మెగ్ ర్యాన్ (ఫ్రానీ), మార్క్ రుఫలో (మల్లోయ్), జెన్నిఫర్ జాసన్ లీ (పౌలిన్), నిక్ డామిసి (రోడ్రిగస్), షరీఫ్ ఆట్కిన్స్ (కార్నెలియస్) తదితరులు నటించారు. ఈ సినిమాకు డియాన్ బీబీ సినిమాటోగ్రఫీ, కాంపియన్ ఫెమినిస్ట్ దృష్టికోణం కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించాయి. బాక్సాఫీస్ వద్ద $23 మిలియన్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, కేవలం 12 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంది. కానీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కింది. వయోలెన్స్, స్ట్రాంగ్ లాంగ్వేజ్‌, చూడకూడని సీన్స్ చాలా ఉంటాయి. కాబట్టి బీ కేర్ ఫుల్.

కథలోకి వెళ్తే…
ఫ్రానీ ఏవరీ (మెగ్ ర్యాన్) అనే న్యూయార్క్ సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఫ్రానీ ఒక డివోర్సీ. తన విద్యార్థులతో కవిత్వం చదువుతూ, ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. కానీ ఆమెలో ఆ కోరికలు ఉండడంతో ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఒక రోజు ఆమె తన అపార్ట్‌మెంట్ సమీపంలోని బార్‌లో సీడీ ప్లేలో ఒక చూడకూడని సీన్ ను చూస్తుంది. ఇంకేముంది ఆమెలో ఉన్న డిజైర్స్ మరింత ఎక్కువ అవుతాయి. ఆ సీన్‌లో ఒక వ్యక్తి రిస్ట్‌లో ఉన్న టాటూను ఆమె గుర్తుంచుకుంటుంది.


ఆ తర్వాత ఆమె విద్యార్థి కార్నెలియస్ (షరీఫ్ ఆట్కిన్స్) ఆమెను ఒక ప్రాజెక్ట్ కోసం కలుస్తాడు. అతని రఫ్ స్లాంగ్, బిహేవియర్ ఆమెను ఆకర్షిస్తుంది. అయినప్పటికీ అది ఆమెకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. అదే సమయంలో ఫ్రానీ పక్కింట్లో ఒక యువతి హత్యకు గురవుతుంది. ఆమె శరీరం దారుణమైన స్థితిలో కన్పిస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ జియోవన్నీ మల్లోయ్ (మార్క్ రుఫలో) ఫ్రానీని కలుస్తాడు. ఎందుకంటే ఆమె బార్‌లో చూసిన సీన్ కేసుతో లింక్ అయి ఉండవచ్చు.

మల్లోయ్ రఫ్, స్ట్రీట్-స్మార్ట్ చార్మ్‌తో ఫ్రానీని ఆకర్షిస్తాడు. వారిద్దరూ ఒక ఇంటెన్స్ రిలేషన్‌షిప్‌లోకి జారుకుంటారు. అయితే మల్లోయ్ రిస్ట్‌లో ఫ్రానీ బార్‌లో చూసిన టాటూ ఉండటంతో, ఆమె అతనిపై అనుమానం పెంచుకుంటుంది. అతను సీరియల్ కిల్లర్ అయి ఉండవచ్చా? అని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే ఫ్రానీ సవతి సోదరి పౌలిన్ (జెన్నిఫర్ జాసన్ లీ) కూడా హత్యకు గురవుతుంది. ఇది ఫ్రానీని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఫ్రానీ మల్లోయ్ పార్ట్‌నర్ డిటెక్టివ్ రోడ్రిగస్ (నిక్ డామిసి), కార్నెలియస్‌పై కూడా అనుమానం పెంచుకుంటుంది. ఎందుకంటే హత్యలలో ఉపయోగించిన రేజర్ బ్లేడ్‌లు కార్నెలియస్ గతంతో లింక్ అవుతాయి. సినిమా ఒక సైకలాజికల్ గేమ్‌గా మారుతుంది. క్లైమాక్స్‌లో ఫ్రానీ ఒక లైట్‌హౌస్‌లో కిల్లర్‌ దగ్గర చిక్కుకుంటుంది. మరి ఆ కిల్లర్ ఎవరు? వాడి నుంచి హీరోయిన్ బయట పడిందా లేదా? అనేది స్టోరీ.

Related News

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి వింత శబ్దాలు… మనుషులతో బలవంతంగా వికృత జీవి ఆ పని… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Big Stories

×