Save The Tigers 3 : తెలుగులో వెబ్ సిరీస్ లు చాలా తక్కువగా వస్తాయి. ఈమధ్య మనం ఒకటో రెండో వెబ్ సిరీస్ లో మాత్రమే చూస్తున్నాము. అందులో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ అంటే సేవ్ ది టైగర్స్.. తేజ కాకమాను దర్శకత్వంలో మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన ఈ షో సూపర్ హిట్ అయింది.. మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో సీజన్ ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అందరు మూడో సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సీజన్ 3 గురించి హీరోయిన్ అప్డేట్ ఇచ్చింది.. అప్పుడే స్ట్రీమింగ్ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది..
Also Read : రష్మీకి లైవ్ లోనే ఘోర అవమానం.. అడ్డంగా పరువు తీసేశాడు..
దేవయాని ఇంటర్వ్యూ..
ఈ సిరీస్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సిరీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ సీజన్ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడ్నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. హీరోయిన్ కిడ్నాప్ కేసు నుంచి హీరోలు ఎలా బయటపడ్డారు అన్నది ఈ సీజన్ లో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. అది కూడా బాగా హిట్ అయ్యింది. దాంతో మూడో సీజన్ కూడా రాబోతుందని అందరు అనుకున్నారు. తాజాగా ఈ సీజన్ గురించి ఓ హీరోయిన్ కీలక అప్డేట్ ని ఇచ్చేసింది. ఈ సిరీస్ లో హీరోయిన్ గా నటించిన దేవయాని గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సిరీస్ సీజన్ 3 గురించి అప్డేట్ ఇచ్చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పింది. అలాగే ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
సేవ్ ది టైగర్స్ స్టోరీ విషయానికొస్తే..
సేవ్ ది టైగర్స్ అంతా భర్తలను కాపాడుకుందాం అనే కామెడీ యాంగిల్‌లోనే సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా తెరకెక్కించారు తేజ. సెకండ్ సీజన్ కూడా అలాగే వెళ్లిపోయాయి. ఈసారి భార్యలకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. తమ భర్తలు ఎదవలే కానీ మరి అమ్మాయిని ఏడిపించే అంత మూర్ఖులు కాదని భార్యలు తమ భర్తలని ఈ కేసు నుంచి బయట పడేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. సీజన్ 3 లో ఎలాంటి ఎలాంటి స్టోరీ తో వస్తారో చూడాలి..
ఇక దేవయాని విషయానికొస్తే.. తమిళం లో సినిమాలు చేసింది. కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మిస్ ఇండియా పోటీలకు వెళ్లి రిజెక్ట్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. కానీ అక్కడ నచ్చక తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చూస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా అవ్వాలని అనుకుంటుంది.