BigTV English

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : కొరియన్ డ్రామాలు గుండెలను కొల్లగొట్టడంలో ముందుంటాయి. కానీ చైనీస్ డ్రామాలు కూడా సైకలాజికల్ థ్రిల్లర్స్, సర్వైవల్ గేమ్ కథలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. మీకు ఒక హార్ట్-టచింగ్ స్టోరీ కావాలా ? అయితే ఈ ఇది మీ కోసమే. వర్చువల్ రియాలిటీ గేమ్‌లో చిక్కుకున్న విద్యార్థుల భయంకరమైన అనుభవాలు, రహస్యాలు, టీమ్‌వర్క్‌తో నిండి ఉన్న చైనీస్ డ్రామా ఈరోజు మన మూవీ సజెషన్. టెన్షన్, ఎమోషన్స్‌తో నిండిన ఈ థ్రిల్లింగ్ రైడ్‌ను ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం పదండి.


స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ చైనీస్ వెబ్ సిరీస్ పేరు ’19th Floor’. 30 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ కై కాంగ్ దర్శకత్వంలో, కై జున్ రాసిన “The Nineteenth Floor of Hell” నవల ఆధారంగా రూపొందింది. 2024 నుండి రాకుటెన్ వికీ (VIKI) అనే ఓటీటీలో ఇండియాలో, మాంగో TV ఇంటర్నేషనల్ యాప్‌లో అందుబాటులో ఉంది. ఇందులో సన్ కియాన్ (చున్ యూ), వీ జెమింగ్ (గావో షువాన్), లుఓ యూ-టాంగ్ (క్వింగ్ యౌ), రాచెల్ వాంగ్ (డౌడౌ), షియావో కై-జాంగ్ (యాంగ్ బావాన్), బై షు (సపోర్టింగ్ రోల్) కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ దాని గ్రిప్పింగ్ స్టోరీ, అద్భుతంగా డిజైన్ చేసిన గేమ్ లెవెల్స్, సన్ కియాన్ యాక్టింగ్ 2024లో దీనిని ఒక అండర్‌రేటెడ్ డ్రామాగా నిలిపాయి.

కథలోకి వెళ్తే…
కథ చున్ యూ (సన్ కియాన్), ఒక యూనివర్సిటీ విద్యార్థిని చుట్టూ తిరుగుతుంది. ఆమె తన స్నేహితురాలు క్వింగ్ యౌ (లుఓ యూ-టాంగ్)తో కలిసి ఒక కారు యాక్సిడెంట్‌లో చిక్కుకుంటుంది. తర్వాత వారు “19th Floor” అనే ఒక భయంకరమైన వర్చువల్ రియాలిటీ (VR) గేమ్‌లో చిక్కుకుంటారు. ఈ గేమ్ ఒక హాంటెడ్ బిల్డింగ్‌లో జరుగుతుంది. ఇందులో ప్రతి ఫ్లోర్ ప్రమాదాలు, భయంకరమైన సవాళ్లతో నిండి ఉంటుంది. గేమ్‌లో ఒక్కో లెవెల్‌ లో గెలవలేకపోతే, ఆటగాళ్లు నిజ జీవితంలో కోమాలోకి వెళ్తారు.


చున్ యూ, క్వింగ్ యౌ, ఇతర విద్యార్థులు డౌడౌ (రాచెల్ వాంగ్), యాంగ్ బావాన్ (షియావో కై-జాంగ్) ఈ గేమ్‌లో చిక్కుకుంటారు. కానీ గావో షువాన్ (వీ జెమింగ్) అనే సబ్‌స్టిట్యూట్ టీచర్, తాను కేవలం నిద్రపోయి ఈ గేమ్‌లోకి వచ్చానని చెబుతాడు. చున్ యూ, గావో షువాన్ కలిసి ఈ గేమ్‌లోని ప్రతి ఫ్లోర్‌ను దాటడానికి టీమ్‌వర్క్‌తో పోరాడతారు. ప్రతి లెవెల్ ఒక కొత్త సవాల్‌తో, మానసిక ఒత్తిడి, ఫిజికల్ డేంజర్స్, లేదా సైకలాజికల్ టెస్ట్‌లతో వస్తుంది.

గేమ్ వెనుక ఉన్న రహస్యం “19 ఫ్లోర్ ఆఫ్ హెల్” గురించి ఒక టెక్స్ట్ మెసేజ్ నుండి మొదలవుతుంది. కథ ముందుకు సాగుతున్నకొద్దీ ఈ గేమ్‌ను సృష్టించిన వ్యక్తి ఎవరు, ఎందుకు సృష్టించారు అనే రహస్యాలు వెలుగులోకి వస్తాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇలాంటి ప్రమాదకరమైన గేమ్ క్రియేట్ చేశాడు? చివరకు ఈ స్టూడెంట్స్ ఆ గేమ్ నుంచి ఎలా బయటపడ్డారు? అనేది చూడాల్సిందే.

Related News

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి వింత శబ్దాలు… మనుషులతో బలవంతంగా వికృత జీవి ఆ పని… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

Big Stories

×