Mothevari Love story: ప్రస్తుత కాలంలో ఆడియన్స్ కూడా నటీనటులతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది యూట్యూబర్స్ కూడా మంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న తాజా సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’. ప్రముఖ యూట్యూబ్ అనిల్ గీలా (Anil geela) హీరోగా.. వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోయిన్ గా నటించారు.
స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ..
ప్రముఖ దర్శకుడు శివకృష్ణ బుర్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సంగీతం అందించగా.. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ Zee5లో ఆగస్ట్ 8న స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సందర్భంగా Zee 5 మెగా ప్రివ్యూ ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమంలో మొదటి నాలుగు ఎపిసోడ్లను చాలా ప్రత్యేకంగా ప్రదర్శించడం గమనార్హం.
యూట్యూబర్ నుంచి హీరో స్థాయికి..
అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించగా ఈ మీడియా సమావేశంలో నటీనటులు, సాంకేతిక బృందం, అతిథులు సిరీస్ పై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సాధారణంగా ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది. అయితే ఆ టాలెంట్ ని గుర్తించగలగాలి. అలా గుర్తించి ప్రయత్నించినప్పుడే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఫోన్ తో మొదలైన ‘మై విలేజ్ షో’ జర్నీ ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది అంటే ఆ యూట్యూబర్స్ ఏ రేంజ్ లో కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సిరీస్ లో అనిల్, వర్షిణి , మాన్సీ అందరూ చాలా చక్కగా అనుభవం ఉన్న నటీనటులులా నటించడం నిజంగా ఈ వెబ్ సిరీస్ కే హైలెట్గా నిలవనుంది. ఇక బలగం సినిమా రేంజ్ లో ఈ మోతెవరి లవ్ స్టోరీ సిరీస్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ చిత్ర బృందం తెలిపింది.
స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ ప్రేమకథ ఆధారంగా..
ఇకపోతే ఈ సీరిస్ పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే రూపొందించినట్లు కూడా తెలుస్తోంది. అనువైన కథా, గ్రామీణ అనుభూతులతో.. హృదయానికి హత్తుకునే ఎమోషనల్ టచ్ తో దీనిని రూపొందించారు. అంతేకాదు వినోదాన్ని, విలువలను సమపాళ్లల్లో మిక్స్ చేస్తూ ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ ప్రేమకథ ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అటు అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అయితే అనిల్ గీలా ఈ సీరీస్ తో హీరోగా సంచలనం సృష్టించాలని కూడా ఆయన ఫాలోవర్స్ కోరుకుంటూ ఉండడం గమనార్హం.
ట్రైలర్ లాంచ్ లో స్టార్ సెలబ్రిటీస్..
ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సదన్న, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం 7 ఎపిసోడ్లతో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ కి ప్రియదర్శి (Priyadarshi ) వాయిస్ ఓవర్ అందించగా.. చిత్ర నిర్మాత తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆనంద్ దేవరకొండ(Anandh Deverakonda) ముఖ్య అతిథిగా విచ్చేశారు. జూలై లో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఇప్పుడు జీ 5 స్ట్రీమింగ్ లోకి వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ALSO READ: PVNS Rohit: మొన్న నేషనల్ అవార్డు.. నేడు నిశ్చితార్థం.. జోరు పెంచిన బేబీ సింగర్!