Liver Health: కాలేయం మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. కానీ.. మనం ఉదయం చేసే కొన్ని చెడు అలవాట్లు కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటి గురించి తెలుసుకుని, జాగ్రత్తపడటం చాలా అవసరం.
1. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం:
చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతారు. ఇది కాలేయానికి చాలా హానికరం. కాఫీలో ఉండే కెఫిన్, ఆమ్లాలు కాలేయంపై ఒత్తిడి పెంచుతాయి. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఉదయం కాఫీ తాగే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు లేదా నిమ్మరసం తాగడం మంచిది.
2. టిఫిన్ మానేయడం:
టిఫిన్ మానేయడం అనేది కాలేయాన్ని డ్యామేజ్ చేస్తుంది. రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఉదయం కాలేయానికి శక్తి అవసరం. ఇలాంటి సమయంలో టిఫిన్ తినకపోతే.. లివర్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లను విడుదల చేయలేదు. ఇది కాలేయం పనితీరుపై ప్రభావం చూపుతుంది.
3. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం:
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిలో ఉండే కృత్రిమ చక్కెరలు, కొవ్వులు, రసాయనాలు కాలేయంపై ఒత్తిడి పెంచుతాయి. ఇది కాలేయానికి ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను కలిగిస్తుంది.
4. తక్కువ నీరు తాగడం:
ఉదయాన్నే తక్కువ నీరు తాగడం కూడా ఒక చెడు అలవాటు. శరీరం రాత్రి నిద్ర తర్వాత డీహైడ్రేట్ అవుతుంది. ఉదయం తగినంత నీరు తాగకపోతే, శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు సరిగ్గా బయటకు వెళ్లవు. ఇది కాలేయంపై భారం పెంచుతుంది.
Also Read: మొటిమలు త్వరగా తగ్గాలంటే ?
5. వ్యాయామం చేయకపోవడం:
ఉదయం పూట వ్యాయామం చేయకపోవడం కాలేయానికి మంచిది కాదు. వ్యాయామం కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం కాస్త వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
6. ధూమపానం, మద్యం:
ఉదయం పూట మద్యం ,సిగరెట్ తాగడం అనేది కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఇవి కాలేయ కణాలను దెబ్బతీస్తాయి. అంతే కాకుండా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి.