OTT Movie: ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites) ఇంకా చూడలేదా? అయితే, ఏం పర్వాలేదు. ఆలస్యంగా చెయ్యడం మంచిదే. ఆ మూవీ చూసేయడానికి ముందు.. ఈ లిస్టు ఫాలో అయిపోండి. అప్పుడు మీకు ఎవరు ఏంటీ.. ఆ ఘటనల వెనుక ఏం జరిగిందనే స్పష్టత వస్తుంది. మరి.. మొదలు పెడదామా!
1. The Nun (2018)
1952లో రొమేనియాలో ఒక నన్ ఆత్మహత్య చేసుకోవడాన్ని వ్యాటికన్ ఫాదర్ బర్క్, సిస్టర్ ఐరీన్ పరిశోధిస్తారు. ఈ సందర్భంగా సెయింట్ కార్టా మఠం నరకానికి ద్వారమని తెలుసుకుంటారు. అక్కడ వాలక్ అనే ఆత్మ.. నన్ రూపంలో భయపెడుతుంది. వాలక్ ఎప్పుడు ఎవరిని ఆవహించి ఎలాంటి బీభత్సం చేస్తుందో తెలీదు. అయితే.. సిస్టర్ ఐరీన్ తన దివ్య దృష్టి ద్వారా వాలక్‌ను ఎదుర్కొంటుంది. స్థానికుడు మారిస్ ఫ్రెంచీ థెరియాల్ట్ ఆమెకు సహాయం చేస్తాడు. వారు క్రీస్తు రక్తం ఉపయోగించి ఎక్సార్సిజం (దెయ్యాన్ని వదిలించే ప్రక్రియ) చేసి.. నరక ద్వారాన్ని మూసివేసి వాలక్ పీడను వదిలిస్తారు. ఫాదర్ బర్క్ ప్రాణాలతో బయటపడతాడు. సిస్టర్ ఐరీన్ నన్ అవుతుంది. (OTT platform: Jio Hotstar)
2. Annabelle: Creation (2017)
1958లో బొమ్మల తయారీదారుడు సామ్యూల్ ముల్లిన్స్, అతని భార్యకు ఒక కూతరు ఉంటుంది. ఆమె పేరు ఎస్తర్. ఆమె అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. ఆమె మరణం తర్వాత ఒంటరిగా జీవించలేక ఒక నన్‌ను, అనాథ పిల్లలను తమ ఇంటికి ఆహ్వానిస్తారు. అయితే, ఆ ఇంట్లో అన్నాబెల్లే అనే బొమ్మలో ఆత్మ ఉంటుంది. అది ఆ పిల్లలను చాలా భయపెడుతుంది. పోలియోతో ఉన్న జానిస్‌ను ఆ బొమ్మ వెంటాడుతుంది. అన్నాబెల్లే ఒక రోజు జానిస్‌ను ఆవహిస్తుంది. అయితే, ఆ బొమ్మలో ఉన్న ఆత్మ ఎస్తరా లేదా మరేదైనా అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. (OTT platform: Amazon Prime Video)
3. Annabelle (2014)
1960 దశకంలో జాన్, మియా ఫార్మ్ దంపతులు ఒక వింటేజ్ బొమ్మను బహుమతిగా పొందుతారు. దాని పేరే అన్నాబెల్లే. ఒక రోజు పొరుగు ఇంట్లో ఉండే కల్ట్ సభ్యులు.. మియా ఇంటిపై దాడి చేస్తారు. ఆ తర్వాతి నుంచే ఆ ఇంట్లో భయనక సంఘటనలు మొదలవుతాయి. ఆ బొమ్మ వారికి నరకం చూపిస్తుంది. చివరికి ఆ డాల్‌ను ఎడ్, లోరైన్ వారెన్‌లకు చేరుతుంది. వారు ఒక దెయ్యాల మ్యూజియంలో దాన్ని బంధిస్తారు. (OTT platform: Netflix and Amazon Prime Video – Rent)
4. The Conjuring (2013)
1971లో పెర్రాన్ కుటుంబం రోడ్ ఐలాండ్ ఫార్మ్‌హౌస్‌కు మారుతుంది. అక్కడ అతీంద్రీయ సంఘటనలు చూస్తారు. దీంతో వారు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లోరైన్ వారెన్ సహాయం కోరతారు. వారెన్ దంపతులు బత్షెబా అనే ఆత్మను కనుగొంటారు. లోరైన్ వారెన్ తన మానసిక శక్తులతో ఆత్మలను ఎక్సార్సైజ్ చేసి కుటుంబాన్ని కాపాడుతుంది. వారెన్ దంపతులు అన్నాబెల్లే బొమ్మను తమ ఆర్టిఫాక్ట్ గదిలో భద్రపరుస్తారు. (OTT platform: Amazon Prime Video)
5. Annabelle Comes Home (2019)
ఎడ్, లోరైన్ వారెన్ అన్నాబెల్లే బొమ్మను తమ ఆర్టిఫాక్ట్ గదిలో ఒక గాజు కేస్‌లో బంధిస్తారు. వారు కేసు పరిశోధనకు వెళ్లినప్పుడు.. వారి కుతురు జూడీని చూసుకొనే బాధ్యతను మేరీ ఎలెన్, ఆమె సోదరి డానియెలాకు అప్పగిస్తారు. డానియెలా ఆర్టిఫాక్ట్ గదిలోకి చొరబడి అన్నాబెల్లే ఆత్మను విడుదల చేస్తుంది. అది ఫెర్రీమాన్, బ్రైడ్, ఫీలీ మీలీ గేమ్, బ్లాక్ షక్ వంటి ఇతర ఆత్మలను సైతం మేల్కొలుపుతుంది. చివరికి జూడీ తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విద్యతో ఆత్మలను ఎదుర్కొంటుంది. అన్నాబెల్లే బొమ్మను తిరిగి ఆ షోకేసులో బంధిస్తుంది. తర్వాత వారెన్ దంపతులు తిరిగి వచ్చి జూడీ పుట్టినరోజు జరుపుకుంటారు. ఇది అన్నాబెల్లే, ది కంజూరింగ్ సినిమాలకు కామన్ సీక్వెల్ మూవీ. (OTT platform: Jio Hotstar)
6. The Curse of La Llorona (2019)
1673లో మెక్సికోలో ఒక తల్లి తన పిల్లలను నదిలో ముంచి చంపుతుంది. 1973లో లాస్ ఏంజిల్స్‌లో కేస్‌వర్కర్ అన్నా పట్రిషియా అల్వారెజ్ ఇద్దరు పిల్లలను షెల్టర్‌కు తీసుకువెళ్తుంది. ఆ రాత్రి లా లోరోనా వారిని చంపుతుంది. ఆ తర్వాత అన్నా పిల్లలు క్రిస్, సామ్‌ను ఆ దెయ్యం వెంటాడుతుంది. లా లోరోనా వారిని కూడా నీటిలో ముంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూవీకి అన్నాబెల్లేతో సంబంధం ఉంటుంది. (OTT platform: Amazon Prime Video – Rent)
7. The Conjuring 2 (2016)
1976లో ఎడ్, లోరైన్ వారెన్ దంపతులు అమిటీవిల్ హౌస్‌ను పరిశోధిస్తారు. లోరైన్ ఎడ్ మరణాన్ని తన దివ్య దృష్టితో చూస్తుంది. 1977లో లండన్‌లో హాడ్సన్ కుటుంబం ఓయిజా బోర్డ్ ఆడుతూ ఆత్మలను పిలుస్తారు. ఆ తర్వాత ఓ ఆత్మ ఆ ఇంటిని వదలకుండా వేధిస్తుంది. చర్చి ఆదేశాలతో వారెన్ దంపతులు ఆ ఇంటిని పరిశోధిస్తారు. అదంతా వాలక్ అనే ఆత్మ చేస్తున్న పని అని తెలుసుకుంటుంది. ఆ వెంటనే దాన్ని నరకానికి తిరిగి పంపిస్తుంది. వారెన్ దంపతులు క్రూకెడ్ మ్యాన్ టాయ్‌ను తమ కలెక్షన్‌లో చేరుస్తారు. ఈ కథతో ‘నన్’ మూవీకి సంబంధం ఉంటుంది. (OTT platform: Amazon Prime Video – Rent)
8. The Conjuring: The Devil Made Me Do It (2021):
1981లో, అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగిన ఒక భయానక సంఘటనతో ఈ మూవీ కథ మొదలవుతుంది. డేవిడ్ గ్లాట్జెల్ అనే చిన్న పిల్లవాడు దెయ్యం ఆవహించినట్లు ప్రవర్తిస్తాడు. ఎడ్, లోరైన్ వారెన్ అతని కుటుంబానికి సహాయం చేయడానికి వస్తారు. డేవిడ్‌ను రక్షించేందుకు ఒక ఎక్సార్సిజం చేస్తారు. ఈ ప్రక్రియలో ఆర్నీ జాన్సన్, డేవిడ్ సోదరి డెబ్బీ ప్రియుడు దెయ్యాన్ని తనని ఆవహించాలని సవాల్ విసురుతాడు. దీంతో దెయ్యం డేవిడ్ నుండి ఆర్నీలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఆర్నీ తన యజమాని అలాన్ బోనోను దారుణంగా హత్య చేస్తాడు. ఆర్నీ అరెస్ట్ అవుతాడు. కానీ అతను ఈ హత్యను దెయ్యం ఆవహించడం వల్ల చేశానని వాదిస్తాడు. ఇది అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా కోర్టులో అరుదైన కేసుగా మారుతుంది. ఎడ్, లోరైన్ ఈ కేసులో ఆర్నీకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. దెయ్యం ఉనికిని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. (OTT platform: Amazon Prime Video – Rent)
9. The Conjuring: Last Rites (2025):
ది కంజూరింగ్ యూనివర్స్‌లో మెయిన్ సిరీస్‌లో చివరి చిత్రం ఇది. ఎడ్, లోరైన్ వారెన్ దంపతులు ఎక్సార్సిజం వదిలిపెట్టి.. సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. ఈ మూవీని ఒక వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. వీరి చివరి కేసులో స్మర్ల్ కుటుంబాన్ని ఓ భయానక ఆత్మ నుంచి రక్షించినట్లు చూపిస్తారు. 1986లో పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగినట్లు మూవీలో చూపించారు. ఈ సినిమా 1964లో ఒక ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. ఎడ్, లోరైన్ వారెన్ దంపతులు తమ కేరీర్ ప్రారంభంలో ఒక భయానకమైన హాన్టెడ్ మిర్రర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ సమయంలో వారెన్ గర్భంతో ఉంటుంది. ఈ మిర్రర్‌లో శక్తివంతమైన ఆత్మ ఉంటుంది. ఇది లోరైన్‌ను భయపెడుతుంది. ఇంతలో ఆమెకు నొప్పులు వస్తాయి. అప్పుడే తన బిడ్డ జూడీకి జన్మనిస్తుంది. ఆ తర్వాత మూవీ 1986లోకి ప్రవేశిస్తుంది. ఆ మిర్రర్ స్మర్ల్ ఇంటికి చేరుతుంది. ఆ ఇంట్లోవాళ్లకు నరకం చూపిస్తుంది. దాన్ని ఎడ్, వారెన్‌లు ఎలా విడిపించారనేది తర్వాతి కథ. ప్రస్తుతం ఈ మూవీతో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
Also Read: Mazaka Producer: మజాకా ఎఫెక్ట్.. రూ. 4 కోట్లు వెనక్కి ఇచ్చేసిన నిర్మాత రాజేష్ దండ