BigTV English

Mazaka Producer: మజాకా ఎఫెక్ట్‌.. రూ. 4 కోట్లు వెనక్కి ఇచ్చేసిన నిర్మాత రాజేష్‌ దండ

Mazaka Producer: మజాకా ఎఫెక్ట్‌.. రూ. 4 కోట్లు వెనక్కి ఇచ్చేసిన నిర్మాత రాజేష్‌ దండ


Mazaka Producer Returns Losses: మొన్నటి వరకు హిట్స్‌, బ్లాక్బస్టర్స్తో టాలీవుడ్ పరిశ్రమ వెలుగువెలిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పాన్ఇండియా ట్రెండ్వచ్చాక.. భారీ బడ్జెట్పెడితేనే హిట్అన్నట్టుగా చూస్తున్నాయి సినీ వర్గాలు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా.. భారీ మొత్తంలో బడ్జెట్పెట్టి నిర్మాతలు చేతులు కాల్చుకుంటున్నారు. వారిని నమ్ముకున్న బయ్యర్లు కూడా నష్టాలు చూస్తున్నారు. వరుసగా చిత్రాలు ప్లాప్అవుతుండటంతో ఇప్పటికీ రియలైజ్అవుతున్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

గొప్పలకు పోయి చేతులు కాల్చుకుంటున్నారు

ప్రస్తుతం బడా నిర్మాతలు సైతం అప్పుల్లో కూరుకుపోయారు. మిడియం రేంజ్ సినిమా తీసే పరిస్థితుల్లో కూడా లేరట. వారిని నమ్మి సినిమా కొన్న బయ్యర్ల పరిస్థితి కూడా అంతేదీంతో బయ్యర్లు తమ స్టైల్మార్చారు. నిర్మాత దగ్గర సినిమా కొనాలంటే.. నష్టాలను తిరిగి ఇస్తేనే.. కొత్త సినిమా కొంటున్నామంటున్నారు. దీంతో చేసేది లేక.. బయ్యర్లకు నష్టాలను వెనక్కి ఇస్తున్నారు. తాజాగా మజాకా మూవీ నిర్మాత కూడా బయ్యర్లకు డబ్బు వెనక్కి ఇచ్చేశాడట. సందీప్కిషన్‌, రావు రమేష్ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మజాకా. హాస్య మూవీస్‌ బ్యానర్‌లో రాజేష్‌ దండా నిర్మించిన చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.


Also Read: Varun Teja-Lavanya Son: వరుణ్తేజ్‌-లావణ్య కొడుకుని చూశారా.. మనవడిని ఎత్తుకుని మురిసిపోతున్న చిరు!

రూ. 4 కో ట్లు వెనక్కి

ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం టీజర్‌, ట్రైలర్లతో మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని మూవీ టీం గట్టిగా నమ్మిందివారి కాన్ఫిడెన్స్చూసి బయ్యర్లు కూడా నిర్మాత కోట్చేసిన ధరకే మజాకాని కొన్నారు. విడుదల తర్వాత మంచి టాక్తెచ్చుకున్న సినిమా.. కమర్షియల్గా ఫెయిల్అయ్యింది. అయితే, విడుదలకు ముందే మజాకా నిర్మాతకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయి. నాన్ థియేట్రికల్ రైట్స్, ఓటీటీ ద్వారా వచ్చిన డబ్బులతో నిర్మాత గట్టెక్కాడు. కానీ, ఆయనన నమ్మన బయ్యర్లే నష్టపోయారు. దాదాపు సినిమా వల్ల బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. దీంతో నష్టాలను వెనక్కి ఇవ్వాలని బయ్యర్లు నిర్మాత రాజేష్దండాకు విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయన చూద్దాం అంటూ మాట దాటేస్తూ వచ్చారు.

కానీ, ఇప్పుడు వారిని తిరిగి డబ్బులు ఇవ్వక తప్పని పరిస్థితి రావడంతో బయ్యర్లు నష్టాలను జిఎస్టీతో కలిసి తిరిగి ఇచ్చేసాడటప్రస్తుతం ఆయన కిరణ్అబ్బవరంతో కే రాంప్‌ (K-Ramp) మూవీ చేస్తున్నాడు. జైన్స్నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అక్టోబర్‌ 18 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రుద్రాంశ్సెల్యులాయిడ్బ్యానర్తో కలిసి రాజేష్దండా చిత్రాన్ని నిర్మించాడు. హాస్య మూవీస్‌, రుద్రాంశ్సెల్యూలాయిడ్బ్యానరల్లో శివ బొమ్మతో కలిసి కేర్యాంప్ని రూపొందించాడు. అయితే ఇప్పు సినిమా విడుదల చేయాలంటే బయ్యర్లు రాజేష్దండా కండిషన్పెట్టారట. మజాకా నష్టాలు తిరిగి ఇస్తేనే.. సినిమా కొట్టామని తేల్చి చెప్పారట. లేదంటే తమ బ్యానర్లో వచ్చే చిత్రాన్ని కొనమని చెప్పడంతో రాజేష్దండా మరో దారి లేక బయ్యర్లు రూ. 4 కోట్లు తిరిగి ఇచ్చేసినట్టు సినీవర్గాల నుంచి టాక్వినిపిస్తోంది.

Related News

Mirai : రాముడి పాత్రలో ఉన్నది ఏ నటుడో తెలుసా… ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు!

Mirai Making Video: డూప్‌ లేకుండ ప్రమాదకరమైన ఫైట్స్‌, స్టంట్స్‌.. ఈ కుర్ర హీరో సాహసానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

Varun Teja-Lavanya Son: వరుణ్‌ తేజ్‌-లావణ్య కొడుకుని చూశారా.. మనవడిని ఎత్తుకుని మురిసిపోతున్న చిరు!

Bhadrakaali trailer: విజయ్ ఆంటోని 25వ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Nayanthara: నయన్‌ను వీడని ‘చంద్రముఖి’.. నోటీసులు ఇచ్చిన నిర్మాతలు? వాస్తవం ఏమిటంటే?

Big Stories

×