OTT Movie : హారర్ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఆడియన్స్ ని ఎంతలా భయపెడితే, ఈ సినిమాలలో అంత మజా ఉంటుంది. అయితే వీటిలో కొన్ని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే, మరికొన్ని తుస్ మనిపిస్తుంటాయి. సినిమా చరిత్రలో టాప్ రేటింగ్ సినిమాలే కాదు, 0% రేటింగ్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 2008లో అత్యంత చెత్త చిత్రంగా నిలిచింది. 84 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను, విమర్శకులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సినిమా రాటెన్ టొమాటోస్‌లో 0% రేటింగ్ ను పొందింది. ఈ సినిమా రేటింగ్ ఎందుకు అంత దారుణంగా పడిపోయిందనే విషయం తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ ను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను కూడా తెలుసుకుందాం పదండి.
‘వన్ మిస్డ్ కాల్’ (One missed call) 2008లో విడుదలైన అమెరికన్ హారర్ ఫిల్మ్. దీన్ని ఎరిక్ వాలెట్ డైరెక్ట్ చేశాడు. ఇది 2003 జపాన్ మూవీ ‘చకుషిన్ అరి’ కి రీమేక్. ఈ చిత్రంలో షానిన్ సోసామోన్, ఎడ్వర్డ్ బర్న్స్, అనా క్లాడియా తలంకన్, రే వైజ్ నటించారు. ఈ సినిమా 2008 జనవరి 4న విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
లీయాన్ అనే అమ్మాయి మొబైల్‌లో ఒక మిస్డ్ కాల్ వస్తుంది. అది కూడా ఆమె సొంత నంబర్ నుండి! అందులో ఒక మెసేజ్ చూసి లీయాన్ ఒక్క సారిగా షాక్ అవుతుంది. ఆమె చనిపోయే సమయం అందులో ఉంటుంది. తేదీ తో పాటు, ఆమె చనిపోయే ముందు చివరి అరుపులు కూడా ఫోన్ లోకి వస్తాయి. మరో వైపు బెత్, ఆమె బాయ్‌ఫ్రెండ్ జాక్ కి కూడా అలాంటి మెసేజ్ లే వస్తాయి. అందులో వాళ్ల చావులు ఎప్పుడు వస్తాయన్న విషయం ఉంటుంది. ఈ కాల్స్ ఒక సూపర్ నాచురల్ కర్స్ వల్ల వస్తుంటాయి. దీని వల్ల ఎవరికైనా మెసేజ్ వస్తే, వాళ్ళు ఆ సమయానికి భయంకరంగా చనిపోతుంటారు. బెత్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ క్రమంలో
బెత్, జాక్ మొదటి డెత్ ను చూస్తారు.
Read Also : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్