Irumudi OTT:మాస్ మహారాజా రవితేజ (Raviteja ) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి. ఆగస్టు 21న థియేటర్లలో విడుదల అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. నెల తిరగకుండానే అనూహ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ చిత్రానికి ఇటు ఓటీటీలో కూడా ఆదరణ విపరీతంగా పెరుగుతుందని, ఇక్కడ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని ,అటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే అనుకున్నంత విధంగా ఈ సినిమా అక్కడ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.
ఇకపోతే సెప్టెంబర్ 18న ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వెండితెరపై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి.. ఇక్కడ ఓటీటీలో మిక్స్డ్ టాక్ రావడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకి ఇక్కడ నెగటివ్ టాక్ రావడానికి కారణం ఈ సినిమాలో తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ , డివోషనల్ ఎమోషన్ వర్కౌట్ అయినప్పటికీ లాజిక్స్ లేకపోవడం, డల్ స్క్రీన్ ప్లే ఇక్కడ మైనస్ గా మారాయి. పైగా క్రైమ్ సమయంలో పోలీసులు ఊరికి రాకపోవడంపై కూడా నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రైటర్లకు ఎమోషన్ అంటే కేవలం అత్యాచారం, వేధింపులేనా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కోవడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా ఊహించని కలెక్షన్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నెలలోపే ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. అంతేకాదు ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 95 కోట్లు రాబట్టి 100 కోట్లకు చేరువ అయ్యింది. కానీ ఇంతలోనే ఓటీటీలోకి రావడంతో ఆ మైలురాయిని అందుకోలేకపోయింది.
also read:విడాకుల వ్యవహారంపై స్పందించిన నీతి టేలర్.. అంత మాట అన్నారేంటి?
ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో.. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ ఇరుముడి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సీలేరు పరిసరాల్లోని ఒక ప్రశాంతమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటూ భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) , కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో సంతోషంగా జీవించే వ్యక్తి త్రినాథ్ (రవితేజ). అయ్యప్ప భక్తుడిగా క్రమశిక్షణతో ఉండే అతనికి కుటుంబమే సర్వస్వం. అయితే ఆ ప్రాంతంలో స్కూల్ కి వెళ్లే కొందరు బాలికలు అనుమానాస్పదస్థితుల్లో ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతుంది. ఈ సంఘటనలకు సంబంధించిన ఒక కీలక విషయం త్రినాథ్ కూతురికి తెలియడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత తన బిడ్డతో పాటు గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు త్రినాథ్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ.