Hidden Smartphone Features: మనం రోజూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూనే ఉంటాం. కానీ అందులో మనకు తెలియని ఎన్నో అద్భుతమైన ఫీచర్లు లోపలి సెట్టింగ్స్‌లో దాగుంటాయ్. ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడటానికి, వాట్సప్ చాట్ చేయడానికి, రీల్స్ చూడటానికి మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. యాపిల్, గూగుల్ కంపెనీలు మన రోజువారీ జీవితాన్ని మరింత సులభం చేయడానికి ఎన్నో సూపర్ టూల్స్‌ను తీసుకొచ్చాయి. వాటి కోసం ఎలాంటి అదనపు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తీసుకొచ్చిన సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్ నిజంగా చాలా గ్రేట్. స్క్రీన్ మీద ఏదైనా ఫోటో, టెక్స్ట్ లేదా వస్తువు నచ్చితే దానిపై సింపుల్‌గా వేలు పెట్టి సర్కిల్ చేస్తే చాలు. గూగుల్ వెంటనే దాని గురించి పూర్తి వివరాలను క్షణాల్లో వెతికిపెడుతుంది. షాపింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
మన ఫోన్‌లో అందరికీ చూపించకూడనటువంటి పర్సనల్ యాప్స్ కొన్ని ఉంటాయి. ఐఫోన్ వాడేవారు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండానే వాటికి ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. అంతేకాదు.. ఆ యాప్స్‌ను ఎవరికీ కనిపించకుండా హైడ్ చేసి, ఒక ప్రత్యేకమైన ఫోల్డర్‌లో దాచుకోవచ్చు. దీనివల్ల మన ఫోన్ వేరే వాళ్ల చేతికి ఇచ్చినా ఎలాంటి భయం ఉండదు.
Also Read: రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!
మనం సాధారణంగా ఫోన్ సెర్చ్ బార్‌ను యాప్స్ వెతకడానికే వాడతాం. కానీ ఐఫోన్‌లోని స్పాట్‌లైట్ సెర్చ్ అంతకంటే చాలా ఎక్కువ పనిచేస్తుంది. హోమ్ స్క్రీన్ మీద కిందకు స్వైప్ చేసి మీకు కావాల్సిన కాంటాక్ట్, మెసేజ్, ఫోటో లేదా సెట్టింగ్ టైప్ చేస్తే చాలు. నేరుగా అక్కడి నుంచే పనులు చక్కబెట్టుకోవచ్చు.
పనిలో ఉన్నప్పుడు పదే పదే వచ్చే నోటిఫికేషన్లతో విసిగిపోతుంటాం. అలాంటప్పుడు ఫోకస్ మోడ్ మనల్ని డిస్టర్బ్ కాకుండా కాపాడుతుంది. ఆఫీస్ టైమ్, నిద్రపోయే సమయం, డ్రైవింగ్ చేసేటప్పుడు వేర్వేరు ప్రొఫైల్స్ సెట్ చేసుకోవచ్చు. ఏ సమయంలో ఏ యాప్ నుంచి నోటిఫికేషన్లు రావాలో మనమే కంట్రోల్ చేసుకోవచ్చు.
ఐఫోన్‌ను రాత్రిపూట హారిజాంటల్‌గా పెట్టి ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్టాండ్‌బై ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఫోన్‌ను ఒక అందమైన టేబుల్ క్లాక్ లాగా మారుస్తుంది. మనకు కావాల్సిన టైమ్, క్యాలెండర్, విడ్జెట్లు స్క్రీన్ మీద క్లియర్ కంట్రోల్స్‌తో కనిపిస్తాయి. ఫోన్ అన్‌లాక్ చేయకుండానే ముఖ్యమైన విషయాలు చూసుకోవచ్చు.
Also Read: జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!