RaghuKula Tilaka RaRa Song: ఇటీవల కాలంలో భక్తి సినిమాలకు అలాగే భక్తి పాటలకు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ముందుకు విడుదలవుతున్న సినిమాలకు కాస్త డివోషనల్ టచ్ ఇవ్వటంతో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఇటీవల రవితేజ హీరోగా అయ్యప్ప స్వామి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఇరుముడి”(Irumudi) సినిమాకు ఎలాంటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో మల్లెపూల పల్లకి(Mallepula Pallaki) సాంగ్ కు థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోయాయి.
ఇలా ఈ పాటకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో త్వరలోనే మరో భక్తి గీతం “రఘుకుల తిలకా రారా” (Ragukulathilaka rara)అనే పాట కూడా వెండితెరపైకి రాబోతోందని తెలుస్తోంది. శ్రీరాముడి గొప్పతనం గురించి వచ్చిన ఈ పాటకు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటను లక్షల రూపాయలు ఖర్చు చేసి రీమిక్స్ రైట్స్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ పాటకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం.
ప్రస్తుతం కిరణ్ అభవరం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు అలాగే దర్శకుడిగా కూడా కొత్త ప్రయత్నం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈయన తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే .ఈ సినిమాకు రియాలిటీ (Reality) అనే టైటిల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రఘుకుల తిలకా రారా అనే పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే థియేటర్లలో మరో బ్లాస్ట్ గ్యారెంటీ అంటూ అభిమానులు భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ పాటకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇప్పటికే యూట్యూబ్లో రఘుకుల తిలకా రారా అనే పాటకు మంచి ఆదరణ లభించింది. మల్లెపూల పల్లకి పాట మంచి సక్సెస్ కావడంతో చిత్ర దర్శక నిర్మాతలు భక్తి గీతాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే ఈయన ఇటీవల చెన్నై లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఈయన సమర్పణలో ప్రేక్షకుల ముందుకు “హతః” సినిమా రాబోతోంది . దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ ఆరో తేదీ ఈ సినిమా విడుదల కానుంది. ఇలా హీరోగా నిర్మాతగా సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో రాబోతున్న రియాలిటీ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
Also Read: భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!