E-Paper
Advertisement

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ
Advertisement

Supernatural Mystery Thriller: ఊరికి దూరంగా ఉన్న ఓ పాత ఇల్లు… స్నేహితురాలికి చిన్న సాయం చేయడానికి వెళ్లిన ఓ యువతి… చివరికి తన ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితిలో చిక్కుకుంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసే ప్రవల్లిక వెళ్లాల్సిన ఓ క్లెయిమ్ పనిని ఆమె స్నేహితురాలు కామాఖ్య చూసేందుకు వెళ్తుంది. ఊరికి దూరంగా ఉన్న ఓ పాత ఇంటికి వెళ్లిన కామాఖ్యకు… ఇంట్లో కనిపించే వింత గుర్తులు, అక్కడి వ్యక్తుల ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగిస్తాయి. బయటకు వెళ్లే ప్రయత్నం చేసినా తలుపులు తెరుచుకోకపోవడంతో ఆమె భయపడుతుంది. ఆ పాత ఇంటి వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘కర్మాఖ్య’ (Karmakhya) కథ. మరి ఈ తెలుగు హర్రర్ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?

కథలోకి వెళ్తే…

కామాఖ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటుంది. ఆమె స్నేహితురాలు ప్రవల్లిక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఓ కుటుంబానికి సంబంధించిన పని కోసం వెళ్లాల్సి ఉన్నా, ప్రవల్లిక వెళ్లలేని పరిస్థితిలో కామాఖ్యను అక్కడికి పంపిస్తుంది. దీంతో స్నేహితురాలికి సాయం చేద్దాం అనుకున్న కామాఖ్య… ఊరి చివర ఉన్న ఓ పాత ఇంటికి చేరుకుంటుంది. ఆ ఇంట్లో సరోజిని, ప్రభాకర్ దంపతులు ఉంటారు. మొదట వాళ్లతో మాట్లాడినప్పుడు పెద్దగా అనుమానం రాదు. కానీ కొద్దిసేపటికే ఇంట్లో ఏదో తేడా ఉందని కామాఖ్యకు అనిపిస్తుంది. చుట్టూ కనిపించే కొన్ని వస్తువులు, చేతబడులకు సంబంధించిన గుర్తులు ఆమెను కలవరపెడతాయి.

Advertisement

బయటకు వెళ్లాలని ప్రయత్నించినా ఆమెకు పరిస్థితులు అనుకూలించవు. ఇంట్లోనే ఉండిపోయిన కామాఖ్యకు మరిన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ కొన్ని రోజులుగా ఓ మృతదేహాన్ని దాచి ఉంచిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ శవం ఎవరిది, దాన్ని ఎందుకు దాచారనే ప్రశ్నలకు సమాధానం వెతికే కొద్దీ ఆ కుటుంబం గురించి నమ్మలేని నిజాలు బయటపడతాయి.

ఈ కథలో తంత్ర సాధనలు, చేతబడితో పాటు కామాఖ్య శక్తిపీఠం నేపథ్యానికి కూడా ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో ఓ జంటకు జరిగిన దారుణ ఘటనకు, ప్రస్తుత పరిణామాలకు సంబంధం ఉన్నట్లు హీరోయిన్ కు తెలుస్తుంది. సరోజిని, ప్రభాకర్ నమ్మే మానవ బలి విశ్వాసం కామాఖ్యకు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇదే సమయంలో ఎస్‌ఐ తిరుపతి రంగంలోకి దిగుతారు. కామాఖ్య ఎక్కడుంది ? ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది ? అక్కడ దాచిన మృతదేహం వెనుక ఉన్న కథ ఏమిటి? అనే విషయాలపై దర్యాప్తు మొదలవుతుంది. ఓ వైపు పోలీసుల విచారణ… మరోవైపు ఆ ఇంట్లో చిక్కుకున్న కామాఖ్య ప్రాణాల కోసం చేసే పోరాటంతో కథ ఉత్కంఠగా సాగుతుంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

సముద్రఖని (Samuthirakani), అభిరామి (Abhirami), శరణ్య ప్రదీప్ (Saranya Pradeep), మధునందన్ (Madhunandan) తదితరులు నటించిన ‘కర్మాఖ్య’కు అభినయ కృష్ణ (Abhinaya Krishna) దర్శకత్వం వహించారు. ఇది మిస్టరీ, సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.

Read Also: హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

Related News

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఓటీటీలోకి 2 మలయాళం సినిమాలు… ఒకటి థ్రిల్లర్, మరొకటి ఫీల్‌గుడ్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఈ వారం 14 కొత్త సినిమాలు, సిరీస్‌లు… తెలుగులోకి డబ్బింగ్ అయిన క్రేజీ మూవీస్ ఇవే

ఇరుముడి: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో విమర్శలు?

రికార్డ్ ధరకి ‘డ్రాగన్’ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

ఓటిటిలోకి అగధ స్ట్రిమింగ్ ఎప్పటినుంచంటే..?

ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

Big Stories

Advertisement
×