NTR Dragon:ఎన్టీఆర్ (Jr NTR), రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో జపాన్ లో ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన అభిమాన సంఘం కూడా ఏర్పడింది. రాజమౌళితో చేసిన సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించారు ఎన్టీఆర్. ఆ తర్వాత హిందీలో హృతిక్ రోషన్ తో తలపడుతూ వార్ 2 చిత్రంలో నటించారు. కానీ ఈ సినిమా ఆయనకు బాలీవుడ్లో మంచి విజయాన్ని అందించలేకపోయింది. పైగా ఇది ఎన్టీఆర్ కి తొలి బాలీవుడ్ మూవీ కూడా కావడం గమనార్హం . ఇకపోతే ఎలాగైనా సరే పాన్ ఇండియాలో సత్తా చాటడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు.
ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు అంటూ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో.. అప్పుడే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారుగా రూ.155 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను బట్టి చూస్తే సినిమా బడ్జెట్లో సగానికి పైగా డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ సుమారుగా రూ.300 నుండి రూ.500 కోట్ల వరకు ఈ సినిమాకు బడ్జెట్ కేటాయించారు. బడ్జెట్లో సగానికి పైగా డిజిటల్ హక్కుల ద్వారానే రికవరీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సాటిలైట్, మ్యూజిక్, నాన్ థియేట్రికల్, థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతే మొత్తం విడుదలకు ముందే రికవరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ లకు పాన్ ఇండియా మార్కెట్ వద్ద ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది . ఒకవేళ ఈ సినిమాకి వీరి మార్కెట్ కి తగ్గట్టుగా బిజినెస్ జరిగిందంటే మాత్రం విడుదలకు ముందే ఈ సినిమా లాభాల బాట పడుతుందనటంలో సందేహం లేదు.
ALSO READ:మీనాక్షికి చుక్కెదురు..హైకోర్టు కీలక ఉత్తర్వులు?
ఇకపోతే వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ గాయం కారణంగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలపాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అంటే దాదాపు 60 రోజులు ఎన్టీఆర్ పోర్షన్ తీయడానికి ఆటంకం ఏర్పడిందన్నమాట. ఈ కోణంలో ఆలోచిస్తే డ్రాగన్ అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎంత వేగంగా షూటింగ్ జరుపుకున్నా.. జూన్ 11న సినిమా రిలీజ్ కావడం అసాధ్యం అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.. మరి చూద్దాం చిత్ర బృందం ఎంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేస్తుందో.. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.