C.Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నిర్మాత సి. కళ్యాణ్ ఒకరు. ఈయన నిర్మాణ సారథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన కళ్యాణ్ (Kalyan) పై తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ (madhapur police Station) లో భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదు కావడంతో ఈ విషయం కాస్త టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చలకు కారణమైంది. అసలు నిర్మాత కళ్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు రావడం ఏంటి అనే విషయానికి వస్తే..
నిర్మాత కళ్యాణ్ మాదాపూర్ లోని సున్నం చెరువు ప్రాంతంలో తమ భూములను కబ్జా చేశారు అంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈయనపై ఫిర్యాదు చేశారు.గుట్టల బేగంపేట్‌లోని సర్వే నంబర్లు 12, 12A, 13లో తమ ప్లాట్లు ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ తెలిపారు అయితే నేడు ఉదయం నిర్మాత కళ్యాణ్ అనుచరులు తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించారని, అనంతరం మా ఫ్లాట్స్ లో బ్లూ షీట్ వేసి రాకపోకలకు అడ్డంకులు సృష్టించారని తెలియజేశారు. ఈ విధంగా మా ఫ్లాట్స్ పట్ల ఆక్రమాలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఇలా అక్రమంగా దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్యాంసింగ్ తెలిపారు.
ఇలా గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్దిరోజులు పాటు సైలెంట్ గా ఉన్న నిర్మాత కళ్యాణ్ తాజాగా మరోసారి తన అనుచరుల చేత దాడి చేయించారని తెలిపారు. ఈ విధంగా తమ ఫ్లాట్లను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న నిర్మాత కళ్యాణ్ అలాగే ప్రకాష్ దారక్, ప్రేమలత పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ సొసైటీ అధ్యక్షుడు శ్యాంసింగ్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇలా భూకబ్జా ఆరోపణలతో నిర్మాత పై కేసు నమోదు కావడంతో చిత్ర పరిశ్రమలో ఈ విషయం పట్ల చర్చలు జరుగుతున్నాయి.
నిజంగానే నిర్మాత కళ్యాణ్ ఈ భూ ఆక్రమాలకు పాల్పడ్డారా? లేదా? అనే విషయాలు తెలియాలి అంటే ఈ వివాదంపై నిర్మాత కళ్యాణ్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం ఈయన నిర్మాతగా సినిమాలను తగ్గించినప్పటికీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. సెప్టెంబర్ 2026లో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ తరఫున సి.కల్యాణ్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు. ఇలా నిర్మాత మండలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళ్యాణ్ గురించి ఈ విధమైనటువంటి భూకబ్జా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై నిర్మాత స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: రోజాకు ఇష్టమైన పొలిటీషియన్ తనేనా.. జగన్ కాదా? ఇదేమీ ట్విస్ట్ రా బాబు!