E-Paper
Advertisement

మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా
Advertisement

Korean Romantic Drama: భర్త మరో మహిళ వెంట తిరుగుతున్న విషయం తెలిసిన ఓ మహిళ… ఆ అవమానాన్ని మౌనంగా భరించదు. అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని, రాజ్యంలో స్త్రీలతో సంబంధాల విషయంలో పేరున్న ఓ ప్లేబాయ్ రాజకుమారుడిని తన ప్లాన్ లోకి తీసుకొస్తుంది. రాజ్యంలో అత్యంత నీతిమంతురాలిగా పేరున్న ఓ యువతిని తన ప్రేమలో పడేయడం అతని పని. మొదట పందెంగా మొదలైన ఈ ప్రయత్నం క్రమంగా నిజమైన ప్రేమగా మారడంతో కథలో ట్విస్ట్ వస్తుంది. ప్రేమ, ప్రతీకారం, కుట్రల మధ్య సాగే కొరియన్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా సిరీసే ‘ది స్కాండల్’ (The Scandal). మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

చోసన్ రాజవంశం నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆ కాలంలో రాజభవనం అంటే కేవలం అధికారం, రాజకీయాలు మాత్రమే కాదు. అక్కడ వ్యక్తిగత సంబంధాలు కూడా కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసేంత శక్తివంతంగా ఉంటాయి. అలాంటి ప్రపంచంలో మేడమ్ చో చాలా తెలివైన, పవర్ ఫుల్ మహిళ. అయితే వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఊహించని అవమానం ఎదురవుతుంది. తన భర్త తనపై ఆసక్తి కోల్పోయి మరో మహిళ వెంట తిరగడం ఆమెను తీవ్రంగా బాధిస్తుంది. మొదట ఆ బాధను భరించినా, క్రమంగా అది ప్రతీకారంగా మారుతుంది. తన భర్తకు తాను అనుభవించిన బాధను అర్థమయ్యేలా చేయాలని నిర్ణయించుకుంటుంది.

Advertisement

అందుకోసం మేడమ్ చో ఓ ప్రమాదకరమైన పందెం వేస్తుంది. రాజ్యంలో స్త్రీలతో సంబంధాల విషయంలో మంచి పేరున్న రాజకుమారుడు జో-వాన్ ను తన ప్రణాళికలోకి తీసుకొస్తుంది. రాజ్యంలో పతివ్రతగా, దైవభక్తి కలిగిన మహిళగా పేరున్న లేడీ సుక్ ను ప్రేమలో పడేయాలి. ఆమె మనసును మార్చగలిగితే పందెం గెలిచినట్టే. తన ఆకర్షణ, మాటతీరు, అనుభవంతో ఈ పని సులభంగానే పూర్తి చేయగలనని జో-వాన్ మొదట భావిస్తాడు. లేడీ సుక్‌ తో పరిచయం పెంచుకునే కొద్దీ అతని అంచనాలు మారతాయి. ఆమె ఇతర మహిళల్లా తన ఆకర్షణకు వెంటనే స్పందించే వ్యక్తి కాదు.

ఆమె వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, తన విలువలపై ఉన్న నమ్మకం జో-వాన్‌ ను ఆకర్షిస్తాయి. పందెం కోసం మొదలైన పరిచయం అతని జీవితంలోనే ఊహించని భావోద్వేగాలకు దారి తీస్తుంది. ఇక్కడి నుంచే కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. లేడీ సుక్‌ను గెలుచుకోవాలనే ఉద్దేశంతో దగ్గరైన జో-వాన్, ఆమెను నిజంగానే ప్రేమించే పరిస్థితిలోకి వెళ్తాడు. దీంతో మేడమ్ చో వేసిన ప్రణాళికకు కొత్త సమస్య ఎదురవుతుంది. వ్యక్తిగత పగ కోసం మొదలైన ఆట ఇప్పుడు ప్రేమతో పాటు రాజభవనంలోని సంబంధాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది.

Advertisement

మేడమ్ చో తన ప్రతీకారాన్ని సాధించేందుకు వేసే ప్రతి అడుగు పరిస్థితులను మరింత కష్టంగా మారుస్తుంది. మరోవైపు జో-వాన్‌కు మొదట్లో ఇది కేవలం పందెంగా కనిపించినా, లేడీ సుక్ పట్ల పెరిగిన భావాలు అతని నిర్ణయాలను మార్చేస్తాయి. పందెం వెనుక ఉన్న అసలు ఉద్దేశం లేడీ సుక్‌ కు ఎప్పుడు తెలుస్తుంది ? ఆ నిజం బయటపడిన తర్వాత ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి? ప్రేమ నిజం అయ్యాక పాత పందెం ఎంత పెద్ద సమస్యగా మారుతుందో, మేడమ్ చో ప్రతీకారం ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలంటే ‘ది స్కాండల్’ సిరీస్ ను చూడాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో ఉందా ?

‘ది స్కాండల్’లో బే యోంగ్-జూన్ (Bae Yong-joon), జియోన్ డో-యోన్ (Jeon Do-yeon), లీ మి-సూక్ (Lee Mi-sook) ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ జే-యోంగ్ (E J-yong) దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. తెలుగు, కొరియన్, ఇంగ్లీష్, హిందీ ఆడియోలు ఉన్నాయి.

Read Also: హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

Tags

Related News

ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

జెన్ జీ మెచ్చే అచ్చ తెలుగు సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

హాకిన్స్ సిటీలో మళ్లీ మొదలైన వింత రాక్షసుల విలయం.. యానిమేషన్ ప్రపంచంలో స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

6మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్లడీ బ్లడ్ బాత్.. పగ, ప్రతీకారాలతో అదిరిపోయే రివేంజ్ డ్రామా

హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్

మురికివాడ నుంచి రేస్ ట్రాక్ వరకు.. స్పోర్ట్స్ అసోసియేషన్ కోరలు పీకే యంగ్ అథ్లెట్

Big Stories

Advertisement
×