Malayalam Thrillers: మలయాళ సినిమాలు అంటేనే సహజమైన కథనం, కొత్త తరహా కథలు, బలమైన పాత్రలకు గుర్తొస్తాయి. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి రెండు విభిన్నమైన సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఒకటి హత్యల వెనుక దాగిన మిస్టరీని ఛేదించే సీట్-ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే, మరొకటి ఒంటరి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఓ పెంపుడు కుక్కతో ఏర్పడే అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా చూపించే ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. థ్రిల్ కోరుకునేవారికి ఒకటి… మనసుకు హాయినిచ్చే కథలను ఇష్టపడేవారికి మరొకటి అన్నమాట. ఆ రెండు సినిమాల విశేషాలేంటో చూద్దాం.
ముందుగా ‘తుడక్కమ్’ (Thudakkam) విషయానికి వస్తే… ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ వారిపై దాడులకు పాల్పడే ఓ సైకో స్టాకర్, కాంట్రాక్ట్ కిల్లర్ చేతికి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన మీనూ చిక్కుతుంది. ఆమెను కిడ్నాప్ చేసి, జనసంచారం లేని ఓ నిర్మానుష్య ప్రాంతంలో బంధిస్తాడు. బయట ప్రపంచానికి ఆమె ఆచూకీ తెలియదు. ఒకవైపు తండ్రి, పోలీసులు ఆమె కోసం వెతుకుతుంటే.. మరోవైపు మీనూ ఒంటరిగా చిక్కుకుపోతుంది. ఆమె తనకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ విద్యనే ఆయుధంగా మార్చుకుని, అక్కడి నుంచి ఎలా తప్పించుకుంది ? అన్నదే కథ.
‘ప్లూటో’ ఎమోషనల్ జర్నీ.
ఇక రెండో సినిమా ‘ప్లూటో’ (Pluto) 2026లో వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ. కేరళకు చెందిన విఘ్నేష్ అలియాస్ విక్కీ (నీరజ్ మాధవ్) జీవితంలో వరుస వైఫల్యాలతో ‘లూజర్’గా ముద్రపడతాడు. ఓ రోజు అతని గ్రామంలోకి ప్రమాదవశాత్తూ ఓ ఏలియన్ వస్తుంది. దానికి ప్లూటో (అల్తాఫ్ సలీం) అని పేరు పెట్టి ఇంట్లో రహస్యంగా దాచుకుంటాడు. విచిత్రంగా ఈ ఏలియన్‌కు సూపర్ పవర్స్ ఉండవు.. ఆల్కహాలే దానికి ఇంధనం. తన గ్రహంలోనూ అండర్‌అచీవర్ అయిన ప్లూటోతో విక్కీకి స్నేహం ఏర్పడటంతో అతని జీవితం గందరగోళంగా మారుతుంది. టైగర్ తంబి (అజు వర్గీస్) వల్ల మరిన్ని కామెడీ చిక్కులు ఎదురవుతాయి. ప్లూటోను తిరిగి గ్రహానికి పంపే క్రమంలో విక్కీ తన విలువను తెలుసుకుంటాడు. ఆదిత్యన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్ష చాందిని బైజు కూడా నటించారు.
‘తుడక్కమ్’లో సినిమాలో మోహన్‌లాల్ (Mohanlal) కూడా ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ యాక్షన్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్‌కు జూడ్ ఆంథోనీ జోసెఫ్ (Jude Anthany Joseph) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘2018’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక హీరోయిన్ విస్మయ మోహన్ లాల్ కు ఇదే మొదటి సినిమా. జియో హాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ‘ప్లూటో’ ప్రైమ్ వీడియో (Prime Video)లో మలయాళం ఒరిజినల్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.