OTT Releases: వీకెండ్ వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు కొత్త కంటెంట్‌తో పండుగే. ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కళకళలాడుతున్నాయి. ఏకంగా 14 క్రేజీ ప్రాజెక్ట్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టాయి. కామెడీ, లవ్, హర్రర్, యాక్షన్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌తో పాటు బోల్డ్ అంథాలజీల వరకు విభిన్నమైన జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పలు సినిమాలు, సిరీస్‌లు తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో ఒక లుక్కేద్దాం పదండి.
ఈ వారం ఓటీటీ లైనప్‌లో ఒక్కో జానర్‌కు ఒక్కో ప్రత్యేకమైన కంటెంట్ కనిపిస్తోంది. మొదరాత్రి (ModhaRathiri) అనే మలయాళం సినిమా నెట్ ఫ్లిక్స్ లో, హారర్ సినిమాలు ఇష్టపడేవారి కోసం ‘లీ క్రోనిన్స్ ది మమ్మీ’ (Lee Cronin’s The Mummy) జియో హాట్‌స్టార్ (JioHotstar)లో సందడి చేస్తున్నాయి. అలాగే పాపులర్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2’ (Stranger Things: Tales from 85 – Season 2) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
బోల్డ్ అండ్ రొమాంటిక్ కంటెంట్ ప్రేక్షకుల కోసం ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) కూడా డిజిటల్ అరంగేట్రం చేసింది. మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన ‘ఇరుముడి’ (Irumudi) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల కోసం ‘తోలుబొమ్మలాట’ (Tholubommalata) అనే యూత్‌ఫుల్ ఎమోషనల్ తెలుగు సిరీస్ ఈటీవీ విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది.
యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడేవారికి కూడా ఈ వారం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో (Prime Video)లో రామ్ అండ్ లీల (Ram and Leela) స్ట్రీమింగ్‌కు రాగా, నీగ్లీ (Neagley), తుడక్కమ్ (Thudakkam) వంటి సిరీస్‌లు కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఉత్కంఠభరితమైన కథలతో పాటు క్యారెక్టర్ డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ కలిసిన ఈ కంటెంట్ తో వీకెండ్ తెలుగు ప్రియులకు పండగే పండగ.
తెలుగు కంటెంట్ విషయానికి వస్తే… ప్రైమ్ వీడియోలో ‘హుషార్ పిట్టలు’ (Hushar Pittalu), ‘కర్మాఖ్య’ (Karmakhya) వంటి సినిమాలు నేరుగా డిజిటల్ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్లలో మిస్ అయిన తెలుగు సినిమాలను ఇంట్లోనే చూసే అవకాశం కూడా ప్రేక్షకులకు దక్కింది. మొత్తంగా ఈ వారం 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌కు కొదవ లేకుండా పోయింది.
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు డబ్బింగ్ సినిమా – నెట్‌ఫ్లిక్స్ – సెప్టెంబర్ 18
మొదరాత్రి తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా – నెట్‌ఫ్లిక్స్ – సెప్టెంబర్ 18
లీ క్రోనిన్స్ ది మమ్మీ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ సినిమా) – జియోహాట్‌స్టార్
రామ్ అండ్ లీల తమిళ ఒరిజినల్ సినిమా (తెలుగు, కన్నడ, మలయాళం) – ప్రైమ్ వీడియో
ఇరుముడి తెలుగు సినిమా 2026 (తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
హుషార్ పిట్టలు తెలుగు సినిమా 2026 – ప్రైమ్ వీడియో
కామాఖ్య తెలుగు సినిమా 2026 – ప్రైమ్ వీడియో
తుడక్కం మలయాళం సినిమా (తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – జియోహాట్‌స్టార్
తోలుబొమ్మలు తెలుగు సిరీస్ – ఈటీవీ విన్
లస్ట్ స్టోరీస్ 3 తెలుగు డబ్బింగ్ హిందీ ఆంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్ – సెప్టెంబర్ 18
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ సిరీస్) – నెట్‌ఫ్లిక్స్
మాన్‌స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ సిరీస్) – నెట్‌ఫ్లిక్స్
యూ + మీ: అగైనెస్ట్ ది వరల్డ్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సిరీస్) – ప్రైమ్ వీడియో
నీగ్లీ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సిరీస్) – ప్రైమ్ వీడియో
Read Also: ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్