Niti Taylor:మేం వయసుకు వచ్చాం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న నీతి టేలర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో ఈమె నటించింది ఈ సినిమాలో మాత్రమే అయినప్పటికీ.. ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత వరుసగా సీరియల్స్, రియాలిటీ షోలు అంటూ దూసుకుపోయిన ఈమె.. 2020లో ఇండియన్ ఆర్మీ కెప్టెన్ పరిక్షిత్ బవాతో ఏడడుగులు వేసింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి.
ఇకపోతే నీతి టేలర్ తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. ఏదైనా ఒక వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది అంటే దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజం కాని విషయాలు ఎప్పుడూ కూడా మనల్ని పెద్దగా బాధించవు. మా బంధం ఎలాంటిదో మాకు తెలుసు. ఈ మార్గాన్ని మేము మా ఇష్టపూర్వకంగానే ఎంచుకున్నాము. ప్రస్తుతం మేము చాలా సంతోషంగా, క్షేమంగా, మా వైవాహిక బంధంలో కొనసాగుతున్నాము. దయచేసి ఎవరు మా కాపురానికి దిష్టి పెట్టకండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తాను తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నానని.. ఈ సంతోషకరమైన సందర్భాలను చూసి దిష్టి పెట్టి మా మధ్య విమర్శలు వచ్చేలా చేయకండి అంటూ వేడుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎట్టకేలకు వైవాహిక జీవితం పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించి చెక్ పెట్టింది.
ALSO READ:‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ కోసం కయాదు లోహర్ కొత్త స్ట్రాటజీ.. ఫొటోస్ వైరల్!
ఇకపోతే ఈమె గతంలో అలయన్స్ అనే ఓటీటీ రియాలిటీ షో ఎపిసోడ్లో పాల్గొని తన మాజీ ప్రియుడి నుండి తాను ఎదుర్కొన్న శారీరక , మానసిక వేధింపులను గుర్తు చేసుకుంటూ తన భర్త తన జీవితంలోకి వచ్చిన తర్వాత కలుగుతున్న సంతోషంపై ఆమె స్పందించింది. నా మాజీ బాయ్ ఫ్రెండ్ నన్ను సిగరెట్టుతో కాల్చి గాయం చేశాడు. హింసాత్మకంగా , మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. నా పుట్టిన రోజున ఒక రాత్రి అతనికి పిచ్చి కూడా పట్టింది. చాలా భయంకరంగా ప్రవర్తించాడు. నన్ను కొట్టాడు. అయితే అతను వెంటనే నాతో బ్రేకప్ చెప్పాడు. అయినప్పటికీ నేను కేవలం ఒక చిన్న పిల్లని.. బలహీనత కారణంగా, మనుషుల మధ్య స్వభావాన్ని సరిగా అంచనా వేయలేము. అతను మానసికంగా స్థిరంగా లేడు. అందుకే నేను దూరం కావాల్సి వచ్చింది. ఇక పరిక్షిత్ నా జీవితంలోకి వచ్చిన దేవుడు” అంటూ చెప్పుకొచ్చింది..
1994 నవంబర్ 8న గుజరాతి తండ్రి, కోల్కతా కి చెందిన బెంగాలీ, క్రైస్తవ మత తల్లికి ఈమె జన్మించింది. మేం వయసుకు వచ్చాం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఈ చిత్రం తర్వాత పెళ్లి పుస్తకంలో నటించింది. టెలివిజన్ స్టార్ గా మారి టీవీ షో లతో ప్రేక్షకులకు దగ్గరయింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలలో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.