Dark Psychological Horror Thriller: ఒక చిన్న పట్టణంలో వరుసగా పిల్లలు కనిపించకుండా పోతున్నారు. బయట మంచు తుఫాను… రోడ్లన్నీ ఖాళీ… ఇలాంటి రాత్రివేళ ఓ పిజ్జా డెలివరీ బాయ్ చివరి ఆర్డర్ తీసుకుని అడవికి సమీపంలోని పాత బంగళాకు వెళ్తాడు. తలుపు తీసిన వ్యక్తి ప్రవర్తన అతనికి అనుమానం కలిగిస్తే ? ఇంట్లోకి తొంగిచూసిన అతనికి కనిపించకూడని దృశ్యం కనిపిస్తే ? తాను కూడా ఆ హంతకుడి బారిన పడితే ? ఆ తర్వాత అక్కడి నుంచి బయట పడేందుకు అతను చేసే పోరాటమే ‘గూడీ గూడీ’ (Goody Goody). ఈ ఇంట్రస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
తీవ్రమైన మంచు తుఫాను కమ్ముకున్న రాత్రి. గూడీ గూడీ అనే చిన్న పట్టణంలో పరిస్థితులు ఇప్పటికే భయానకంగా ఉంటాయి. పదేళ్ల లోపు పిల్లలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతుంటారు. కానీ మిస్సింగ్ కేసులకు సంబంధించి పోలీసులకు స్పష్టమైన ఆధారాలు దొరకవు. దీంతో ప్రజల్లో రకరకాల అనుమానాలు మొదలవుతాయి. ఎవరో సైకో కిల్లర్ పిల్లలను టార్గెట్ చేస్తున్నాడని కొందరు భావిస్తే… ఇంకొందరు దెయ్యం కథలు చెప్పుకుంటారు. కానీ అసలు నిజం మాత్రం పట్టణానికి తెలియదు.
అలాంటి టైమ్ లో ఓ రాత్రి మార్క్ అనే పిజ్జా డెలివరీ బాయ్ కి అడవి చివర ఉన్న ఓ పాత బంగళాకు చివరి ఆర్డర్ వస్తుంది. వాతావరణం బాగోలేకపోయినా పని పూర్తి చేయడానికి అతను అక్కడికి వెళ్తాడు. బంగళా చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో మొదటి నుంచే అతనికి ఏదో వింతగా అనిపిస్తుంది. తలుపు తెరిచిన వ్యక్తి ప్రవర్తన కూడా మార్క్ అనుమానాన్ని మరింత పెంచుతుంది. సాధారణ కస్టమర్ లా కనిపించని అతని మాటలు, ఇంట్లోని వాతావరణం మార్క్ కు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. డెలివరీ ఇచ్చి వెళ్లిపోవాల్సిన అతను… లోపల నుంచి వినిపించే కొన్ని శబ్దాలతో అక్కడే ఆగిపోతాడు.
అనుమానం పెరగడంతో మార్క్ ఇంట్లోకి తొంగిచూస్తాడు. అక్కడ అతనికి కనిపించే దృశ్యం అతని ఊహకు కూడా అందదు. పట్టణం నుంచి అదృశ్యమైన పిల్లల జాడ ఆ ఇంట్లోనే ఉన్నట్టు అతనికి అర్థమవుతుంది. పిల్లలను దాచిపెట్టిన రహస్యం అక్కడ బయట పడుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని మార్క్ ప్రయత్నించేలోపే అతని ఉనికిని హంతకుడు గుర్తిస్తాడు. క్షణాల్లో పరిస్థితి మారిపోతుంది. ఇతరులను కాపాడేందుకు వెళ్లిన మార్క్ తానే బందీగా మారిపోతాడు.
ఇప్పుడు మొదట తాను ప్రాణాలతో బయటపడాలి. రెండోది… అక్కడ బంధీగా ఉన్న పిల్లలను రక్షించాలి. కానీ బయట మంచు తుఫాను, లోపల సైకో కిల్లర్. అసలు ఆ హంతకుడు పిల్లలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? మార్క్ అతని నుంచి ఎలా తప్పించుకుంటాడు ? బంగళాలో దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి ? పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలడా ? అన్నది తెలుసుకోవాలంటే మూవీపై ఒక లుక్కేయాల్సిందే.
‘గూడీ గూడీ’లో నికోలస్ కేజ్ (Nicolas Cage), మైఖేల్ షానన్ (Michael Shannon) నటించారు. పాన్స్ కాస్మాటోస్ (Panos Cosmatos) దర్శకత్వం వహించిన ఈ డార్క్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ షడర్ (Shudder)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ లో మాత్రమే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు. సైకో కిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సినిమాను డోంట్ మిస్.
Read Also: డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్