BigTV English

OTT: ఓటీటీ సినిమా థియేటర్ ను చంపేస్తోందా? అసలేం అవుతోంది?

OTT: ఓటీటీ సినిమా థియేటర్ ను చంపేస్తోందా? అసలేం అవుతోంది?

OTT: ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్ కి వెళ్లేవాళ్లు.. కానీ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత థియేటర్ కంటే ఓటీటీకి ఆదరణ మరింత పెరిగిపోయింది. అటు థియేటర్లలో విడుదలైన ఏ సినిమా అయినా సరే 8 వారాలు లేదా నెలలోపే ఓటీటీలోకి వస్తుండడంతో.. థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్రజలు కూడా ఆసక్తి కనబరచడం లేదు. నిజానికి ఒకప్పుడు సినిమా థియేటర్లో సినిమా చూడడం అనేది మన కల్చర్ లో ఎప్పటినుంచో ఉన్న ఒక ఆనవాయితీ. మనకు ఇష్టమైన హీరో సినిమా విడుదలవుతోంది అంటే చాలు.. ఇల్లు, వాకిలి మర్చిపోయి మరీ సినిమాకు వెళ్ళిపోతాం. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ఒక లగ్జరీగా మారిపోయింది. అసలు ఎందుకు ఇలా మారిపోయింది? అంటే.. దానికి ఓటీటీ కారణమా? లేదా సినిమా టికెట్ రేట్లు పెరగడమా? లేదా తరం మారుతోంది కాబట్టి ఆడియన్స్ అభిరుచులు కూడా మారిపోతున్నాయా? అనే విషయాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


ఓటీటీ..

ఓటీటీ అనేది సినిమాకి ఒక షెల్ఫ్ లాంటిది. ఒకప్పుడు సినిమా థియేటర్లో చూశాక మళ్లీ చూడాలనిపిస్తే.. డీవీడీ లోనో లేక టీవీలోనో చూసేవాళ్ళం. ఇప్పుడు డీవీడీ కాలం అంతరించిపోయాక.. దాని స్థానంలో ఓటీటీ వచ్చింది. మొదట్లో ఇది మంచి విషయమే.. సినిమా ప్రొడ్యూసర్ కి డబ్బు సంపాదించడం దొరికింది అనుకున్నాం.. కానీ మెల్లిగా దీని అసలు ప్రభావం మనకు అర్థం అవుతోంది. ఇప్పుడున్న ఓటీటీ కంపెనీలు అన్నీ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఆయా సినిమాకి మార్కెట్లో ఉన్న క్రేజ్ ను బట్టి.. ప్రొడ్యూసర్ కి డబ్బులు ఇచ్చి స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేస్తున్నాయి. నిర్మాత అలా వచ్చిన డబ్బులను వాడుకొని సినిమా మీద ఖర్చు పెడుతున్నారు. ఇది ఓటీటీ కంపెనీలకు అర్థమయ్యి .. వాళ్ళు షరతులు పెట్టడం మొదలుపెట్టారు. అదే 30 రోజుల నిడివి.. అంటే, సినిమా థియేటర్లో రిలీజ్ అయిన డేట్ దగ్గర నుంచి 30 రోజుల్లో ఓటీటీలో స్ట్రీమ్ అయిపోవాలి. ఈ రూల్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి.

అవేంటంటే సినిమా చూసే ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి టికెట్ కొనడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. మంచి సినిమా అని రివ్యూలు రాసినా.. మౌత్ టాక్ వచ్చినా సరే ఎలాగో ఇంకొన్ని రోజుల్లో ఓటీటీకి వస్తుంది కదా! అప్పుడు తీరికగా కుటుంబంతో కలిసి చూడొచ్చులే అనే ఆలోచన ఆడియన్స్ మైండ్ లో పడిపోయింది. దీనివల్ల ఓటీటీ కంపెనీలు నిర్మాతల మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాయి. మీరు చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ చేయకపోతే.. మాకు నష్టం వస్తుంది. మేము భరించలేము. దానికి మీరే బాధ్యత తీసుకోవాలి.. అనేసరికి అటు నిర్మాతలు కూడా భయపడిపోయి.. సగం వండిన కూరలా సినిమాను తొందరగా కంప్లీట్ చేసి, రిలీజ్ చేస్తున్నారు. అలా తీసిన సినిమాలు కాస్త డిజాస్టర్ అవుతున్నాయి. ఇలా జీవితచక్రంలో ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నట్లు ఓటీటీకి, సినిమా ఎండ్ ప్రోడక్ట్ కి చిక్కులు అనేకం.


also read:Madharaasi: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శివ కార్తికేయన్ మదరాసి.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

దీనికి తోడు పాన్ ఇండియా జబ్బు..

ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఎందుకు అంత ధరలు పెంచుతున్నారు అని నిర్మాతను అడిగితే.. సినిమా తీయడానికి ఖర్చు పెరిగిపోయింది అంటున్నాడు.. అంటే, ఇక్కడ నిర్మాతది తప్పేం లేదు. మన దగ్గర కొత్తగా పాన్ ఇండియా సినిమా అనే జబ్బు ఒకటి అందరి హీరోలకి, దర్శకులకు వ్యాపిస్తోంది. దానివల్లే ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు కూడా పెరిగిపోయాయి. నేను బాహుబలి కంటే పెద్ద సినిమా తీయగలను అని దర్శకుడు.. నేను ప్రభాస్ కంటే మంచి యాక్టర్ ని.. అతని కంటే పెద్ద స్టార్ అయ్యే సత్తా నాకు ఉంది అని.. హీరోలు కూడా గాల్లో మేడలు కట్టుకొని బ్రతికేస్తున్నారు. దానివల్ల సినిమాలో ఉన్న కథ కంటే ఎమోషన్ లేని సీన్లు, సోల్ లేని పాత్రలను డిజైన్ చేసి మన మీదకు రుద్దేస్తున్నారు. అవి చూసి మనలో కొంచెం కూడా చలనం కలగట్లేదు. ఇది ఏం సినిమా రా బాబు అనుకొని బయటకు వచ్చి బండ బూతులు తిట్టేస్తున్నాం. ఇలా పాన్ ఇండియా అనే ఐడియాను సరిగ్గా అర్థం చేసుకోకుండా చాలా సినిమాలు బయటకు వచ్చి వరదలో కొట్టుకొని పోయాయి.

ఆడియన్స్ టేస్ట్..

ఇకపోతే పైన చెప్పిన సమస్యలను మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రాబ్లం అయితే ఎటువైపు నుంచి చూసినా మారదు అనిపిస్తోంది. అదే అభిమానుల అభిరుచి. ఒకప్పుడు సినిమా నిడివి ఎంత ఉంది అని పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు.. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందు అది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. యాక్షన్స్ సినిమా అయితే 2 గంటల 40 నిమిషాలు, లవ్ స్టోరీ సినిమా అయితే 2 గంటలు, కామెడీ సినిమా అయితే 2 గంటలు ఉండాలి అని ఆడియన్స్ ముందే డిసైడ్ అయిపోయారు. దీన్ని చూసి.. ఇది ఏంట్రా బాబు అని రచయిత, దర్శకుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు. అసలు నిడివితో ఆడియన్స్ కి ఏం పని? వాళ్లకు బోర్ కొట్టకుండా సినిమాలో ఎంగేజ్ చేస్తే చాలు కదా.. ఈ నిడివి విషయం వాళ్లకు ఎందుకు అని ఇబ్బంది పడిపోతున్నారు.

మరి ఈ సమస్య ఎక్కడ నుంచి మొదలైంది.. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుంచి అని చెప్పాలి. సోషల్ మీడియా కంపెనీలు తమ యూజర్ ని వాళ్ళ యాప్ ఎక్కువ సేపు వాడడానికి కనిపెట్టిన చిట్కానే షార్ట్ వీడియో. దానినే రీల్ అని కొంతమంది, షార్ట్ అని మరికొంతమంది అంటారు. ఇది యూజర్ మైండ్ సెట్ ను మార్చేస్తూ.. ఒక్క నిమిషంలోపే వాళ్లకి కావలసిన ఎమోషన్, ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఇక సినిమా చూసి టైం పాస్ ఎందుకు చేస్తారు?

కంక్లూషన్..

ఇలా సినిమా థియేటర్ చనిపోతుంది అనడానికి వీటి కంటే మంచి కారణాలు మరొకటి లేవు అని చెప్పవచ్చు. ఒకవేళ ఉన్నా.. అవి చిన్నవి.. పైగా తీర్చగలిగేవి మాత్రమే అయి ఉంటాయి. ఏది ఏమైనా ప్రతిదానికి అంతం ఉంటుంది. కాబట్టి సినిమా థియేటర్ కి అంతం రాబోతోంది అని గ్రహించి, మనసులో ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే.. కనీసం కొంతైనా ఊరట దొరుకుతుంది.

Related News

Madharaasi: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శివ కార్తికేయన్ మదరాసి.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movie : చిన్న క్లూ కూడా వదలకుండా చంపే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న సీట్ ఎడ్జ్ కన్నడ క్రైమ్ కథ

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… కట్టుకున్న వాడు ఉండగానే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

OTT Movie : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

OTT Movie : వరుస హత్యలు చేసే కిల్లర్ అమ్మాయి చేతిలో అడ్డంగా బుక్… ఒక్కో ట్విస్టుకు పూనకాలే

OTT Movie : నది ఒడ్డున అమ్మాయి శవం… ఒంటిపై బట్టల్లేకుండా దారుణం… చేసిందెవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : మోడలింగ్ ముసుగులో పాడు పని… హత్యలకు సిరంజి సాక్ష్యం… మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

Big Stories

×