ADE Ambedkar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న సోదాలు భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ఆరు ఇంటి స్థలాలు, ఐదు అంతస్థుల బిల్డింగ్, పది ఎకరాల్లో ఒక కెమికల్ కంపెనీ, ఆరు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. రెండు కార్లతో పాటు రూ.2.18 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్ ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా భారీగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. హైటెక్స్ లోని అంబేద్కర్ నివాసంతో పాటు, బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ బినామీ సతీష్ నివాసం పటాన్ చెరులో మొత్తం 2 కోట్ల లిక్విడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు..
అంబేద్కర్ బినామీల కోణంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బందువుల ఇళ్లతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ భూములు, అపార్ట్ మెంట్స్, ఫ్లాట్స్ ఫామ్ హౌస్ ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి మణికొండలో అంబేదక్కర్ ఏడీఈగా పని చేస్తున్నారు. అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ALSO READ: భారీ అవినీతి అనకొండ.. లెక్కలేనంత డబ్బు, ఎలా సంపాదించావ్..?