Big Breaking: కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితం సచివాలయానికి వచ్చిన మధు యాష్కికి ఛాతి నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మంత్రి శ్రీధర్ బాబు పేచీలో ఉన్న మధుయాష్కికి ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో సిబ్బంది తక్షణ వైద్య సహాయం అందించారు. అనంతరం సిబ్బంది వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Passport Centre: దేశంలో తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?