Madharaasi: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan)హీరోగా ఏ.ఆర్.మురగదాస్ (AR Muragadas) దర్శకత్వంలో వచ్చిన చిత్రం మదరాసి (Madharaasi). భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ప్రముఖ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini vasanth) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. డిజాస్టర్ గా నిలవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సికిందర్, దర్బార్ లాంటి చిత్రాల తర్వాత మురగదాస్ మసాలా యాక్షన్, థ్రిల్లర్ తో వచ్చాడు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కొంతమందిని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. దాదాపు రూ.91 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ.60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 3 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. అటు సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీ లోకి రావడం ఆశ్చర్యంగా మారింది. తమిళ్ , తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మదరాసి సినిమా స్టోరీ..
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తమిళనాడులో తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి సొమ్ము చేసుకోవాలనేదే అక్కడి సిండికేట్ పన్నాగం. ఇందులో విరాట్, చిరాగ్ అనే ఇద్దరు స్నేహితులని రంగంలోకి దించి పెద్ద ఎత్తున ఆయుధాలను ఆ సిండికేట్ తరలిస్తూ ఉంటుంది. అవన్నీ ఒక ఫ్యాక్టరీకి చేరుతూ ఉండగా ఎన్ఐఏ కి తెలుస్తుంది. ప్రేమ్ నాథ్ నేతృత్వంలోని ఎన్ ఐ ఏ ఆపాలని ప్రయత్నించినా.. అది సాధ్యపడదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చివేయాలనే ఒక ఆపరేషన్ కి నడుం బిగుస్తుంది ఎన్ఐఏ. అయితే ఆపరేషన్ అంత సులభమైనది కాదు. ఒకరి ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి ఉంటుంది. సరిగా అదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురాం ను ప్రేమ్ నాథ్ కలుస్తారు. ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయని రఘురామ్ ని ఆపరేషన్ కోసం తీసుకోవాలని నిర్ణయిస్తారు.. అలా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందా? అసలు రఘురాం ఎవరు? ఎందుకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ? ఇలా తదితర విషయాలు తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.
ALSO READ:Film industry: గుండెపోటుతో చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. ఎవరంటే?
చిన్న సినిమా దాటికి తట్టుకోలేకపోయిన మదరాసి..
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 5వ తేదీన మదరాసి తో పాటు లిటిల్ హార్ట్స్ అనే యూత్ లవ్ స్టోరీ అలాగే అనుష్క శెట్టి(Anushka Shetty) ‘ఘాటీ’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో యూట్యూబ్ స్టార్ మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ సెన్సేషన్ హిట్ అయింది. కామెడీ సినిమా కావడంతో అటు ఆడియన్స్ కూడా ఈ సినిమాకు ఓటు వేశారు. మదరాసి , ఘాటీ రెండు సినిమాలు ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు.. పైగా కథలో కూడా అంత పెద్ద విషయం ఏమీ లేకపోవడంతో థియేటర్లో నిలవలేకపోయాయి. ఇక ఈ రెండు సినిమాలలో లిటిల్ హార్ట్స్ సినిమాదే పై చేయి కావడం గమనార్హం.