E-Paper
Advertisement

అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్

అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్
Advertisement

Thriller Series :  నాజీలు గెలిచిన ప్రపంచంలో జరిగే థ్రిల్లింగ్ పీరియాడిక్ సిరీస్ ‘ది మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత పాపులర్ అయిన సైన్స్ ఫిక్షన్, ఆల్టర్నేట్ హిస్టరీ సిరీస్ ఇది. ఫిలిప్ కె. డిక్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్, “రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్, జపాన్ గెలిస్తే ప్రపంచం ఎలా ఉంటుంది ? అనే ఊహాజనిత ప్రశ్నకు భయంకరమైన, ఆలోచింపజేసే సమాధానం ఇస్తుంది ఈ మూవీ.

కథలోకి వెళ్తే…

1962 సంవత్సరంలో స్టోరీ నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఓడిపోతుంది. ప్రపంచాన్ని ఇప్పుడు రెండు భయంకరమైన శక్తులు పంచుకుంటాయి. నాజీ జర్మనీ ఆధీనంలో “గ్రేటర్ నాజీ రీచ్” అని పిలుచుకునే మధ్య .తూర్పు తీరం ఉంటుంది. భయం, హింస, జాతి వివక్షతలతో నిండిన సర్వాధికార రాజ్యం ఇది. జపాన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న పశ్చిమ తీరాన్ని “జపనీస్ పసిఫిక్ స్టేట్స్” అని పిలుచుకుంటారు. కట్టుబాట్లు, గూఢచార్యం, సామ్రాజ్యవాదంతో నిండిన ప్రాంతం అది. మధ్య భాగం మాత్రం రెండు శక్తుల మధ్య ఉన్న “న్యూట్రల్ జోన్”. చట్టం లేని, అనిశ్చితి నిండిన సరిహద్దు ప్రాంతం అది.

Advertisement

శాన్ ఫ్రాన్సిస్కోలో సాధారణ జీవితం గడుపుతున్న జులియానా క్రెయిన్ (అలెగ్జాండ్రా స్కార్స్‌గార్డ్) ఒక రోజు తన సోదరి మరణంతో ఒక రహస్య ఫిల్మ్ రీల్‌ ను పొందుతుంది. ఆ ఫిల్మ్‌ లో అమెరికా మిత్రపక్షాలు యుద్ధంలో గెలిచి, నాజీలు ఓడిపోయిన ప్రపంచం కనిపిస్తుంది అంటే మనం ఎరిగిన నిజమైన చరిత్ర అన్నమాట. ఆ ఫిల్మ్‌లను ‘ది మ్యాన్ ఇన్ ద హై కాజిల్’ అనే రహస్య వ్యక్తి సేకరిస్తున్నాడని తెలిసి, జులియానా వాటిని న్యూట్రల్ జోన్‌కు చేర్చాలని నిర్ణయించుకుంటుంది.

ఈ ప్రయాణంలో ఆమెకు జో బ్లేక్ (లూక్ క్లైన్) అనే యువకుడు పరిచయమవుతాడు. కానీ జో నిజానికి నాజీల తరపున పని చేసే రహస్య ఏజెంట్.కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఒక భారీ సత్యం బయట పడుతుంది. ఆ ఫిల్మ్‌లు కేవలం ఊహాజనిత దృశ్యాలు కావు. అవి ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చిన నిజమైన దృశ్యాలు. ‘ది మ్యాన్ ఇన్ ద హై కాజిల్’ ఆ ప్రపంచాల మధ్య ప్రయాణించగల ట్రావెలర్ల సహాయంతో ఆ ఫిల్మ్‌లను సేకరిస్తున్నాడు.

Advertisement

నాజీలు ఈ రహస్యాన్ని తెలుసుకుని, వేరే ప్రపంచాలపై కూడా దాడి చేయడానికి ‘పోర్టల్’ నిర్మించే పనిలో పడతారు. ఈ క్రమంలో నాజీ అధికారి జాన్ స్మిత్ క్రూరత్వం, జపాన్-నాజీ మధ్య రాజకీయ కుట్రలు, తిరుగుబాటు ఉద్యమం అన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. చివరి సీజన్‌ లో జులియానా సమాంతర ప్రపంచంలోకి ప్రయాణించి, నాజీలు లేని స్వేచ్ఛగల ప్రపంచాన్ని చూస్తుంది. తన ప్రపంచాన్ని మార్చాలని నిర్ణయించుకుంటుంది. చివరకు నాజీ పోర్టల్ తెరుచుకుంటుంది. కానీ అందులో ఎవరు వచ్చారో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ షాకింగ్ సీన్ ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. ఈ సిరీస్ నాలుగు సీజన్లు ఉంది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

Read Also : ఇద్దరబ్బాయిలతో ఒకే అమ్మాయి… ఈ చైనీస్ సిరీస్ తో సాటిస్ఫ్యాక్షన్ గ్యారంటీ

Related News

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ!

హోర్డింగ్ లోపల వ్యక్తి నివాసం.. నెట్‌ ఫ్లిక్స్ వింత ప్రచారం!

భార్య కోసం దెయ్యంగా మారిన భర్త… గోడలో దాచిన చీటీతో అదిరిపడే ట్విస్ట్

70 ఏళ్ల బామ్మకు పెళ్లి… మనవడు చేసిన పని తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ తెలుగులో

6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 19 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ హారర్ కామెడీ

ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ

అప్పు తీర్చేందుకు శవాన్ని కిడ్నాప్ చేశారు… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్

Big Stories

Advertisement
×