Suspense Thriller : 2019లో విడుదలై, బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులను అల్లకల్లోలం చేసిన చిత్రం ‘ది బాడీ’ (The Body 2019). జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పానిష్ ఒరిజినల్ చిత్రం రీమేక్. ఒక్క రాత్రి జరిగే పోలీస్ విచారణ ద్వారా భార్య హత్య, మాయమైన శవం, రహస్య సంబంధాలు, పగ తీర్చుకునే ప్రతీకారం వంటి అంశాలను తీవ్రమైన సస్పెన్స్‌తో అల్లి, చివరి నిమిషం వరకు ప్రేక్షకులను ఊహించని ట్విస్టులతో షాక్ చేసే చిత్రం ఇది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
వ్యాపారవేత్త, కోటీశ్వరురాలు మాయా వర్మ (శోభితా ధూళిపాళ్ల) మన హీరోయిన్. తనకంటే చిన్న వయసు గల ల్యాబ్ ప్రొఫెసర్ అజయ్ పూరి (ఇమ్రాన్ హష్మీ)ని వివాహం చేసుకుంటుంది. బయటకు ఎంతో సంతోషంగా ఉండే జంటలా కనిపించినా, వారి ఇంటి లోపలి విషయాలు చాలా ఉద్రిక్తంగా ఉంటాయి. ఒక రాత్రి మాయా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తుంది. కానీ పోస్ట్‌మార్టం కోసం మార్చురీలో ఉంచిన ఆమె శవం మరుసటి రోజు మిస్టరీగా మాయమవుతుంది. ఈ విచిత్ర కేసును దర్యాప్తు చేయడానికి అనుభవజ్ఞుడైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ జైరాజ్ రావల్ (రిషి కపూర్) బాధ్యత తీసుకుంటాడు.
అజయ్‌ను మార్చురీకి పిలిపించి విచారణ ప్రారంభిస్తాడు జైరాజ్. విచారణ సాగుతున్న కొద్దీ అజయ్ ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు కనిపిస్తాయి. అతనికి రీతూ (వేదిక) అనే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తుంది. క్రమంగా అజయ్ తన భార్యను చంపినట్లు సందేహాలు తలెత్తుతాయి. అజయ్ తన ల్యాబ్ నుంచి ట్రేస్ అవ్వని ఒక రహస్య విషాన్ని (Cardiotoxin) ఉపయోగించి భార్యను హత్య చేశాడని బయట పడుతుంది. కానీ కథ ఇక్కడే ఆగదు. విచారణ ముగిసేలోపు ఒక్కొక్క ట్విస్ట్ బయటపడుతూ మొత్తం కథను తలక్రిందులు చేస్తాయి. చివరి 20 నిమిషాల్లో సినిమా పూర్తిగా మారిపోతుంది. మాయా శవాన్ని మార్చురీ నుంచి దొంగిలించింది ఎవరో, రీతూ అసలు ఎవరో, జైరాజ్ రావల్ ఈ కేసుకు ఎందుకు ఇంత ఆసక్తి చూపుతున్నాడో… అన్నీ ఒక్కసారిగా కనెక్ట్ అయి భారీ ట్విస్ట్‌లు ఇస్తాయి.
10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోర కారు ప్రమాదం ఈ కథకు మూలం అని తెలియడం ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. చివరికి జైరాజ్ అసలు నిజం చెప్పడంతో సినిమా హార్ట్ బ్రేకింగ్, ఉత్కంఠభరితమైన ముగింపుకు చేరుకుంటుంది. ఇమ్రాన్ హష్మీ ఇంతవరకు చూడని ఇంటెన్స్, నెర్వస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. చివరి దశలో రిషి కపూర్ ఇచ్చిన గుర్తుండిపోయే పాత్రల్లో ఇది కూడా ఒకటి. శోభితా ధూళిపాళ్ల బలమైన స్క్రీన్ ప్రజెన్స్, ఒక్క రాత్రి జరిగే విచారణ ఫార్మాట్‌తో నాన్-స్టాప్ సస్పెన్స్, ఊహించని ట్విస్టులు, స్మార్ట్ స్క్రీన్‌ప్లే బాగుంటాయి. ‘ది బాడీ’ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.
Read Also : డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో