E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కంటికి కనిపించకుండా మనుషులను చంపే జీవులు.. క్లైమాక్స్ చూస్తే మతిపోద్ది!

కంటికి కనిపించకుండా మనుషులను చంపే జీవులు.. క్లైమాక్స్ చూస్తే మతిపోద్ది!
Advertisement

Sci Fi Action Thriller ;  అదృశ్య శత్రువులతో జరిగే భయంకరమైన వార్ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పెక్ట్రల్’ (Spectral). 2016లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్న టెన్షన్ తో ప్రేక్షకులను ఊపిరి బిగబట్టి చూసేలా చేసిన ఈ సినిమా సై-ఫై, మిలిటరీ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది. నికోలో డి లాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంటికి కనిపించని, క్షణాల్లో మనుషులను గడ్డకట్టించి చంపేసే భయంకరమైన శక్తుల చుట్టూ తిరుగుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటంటే ?

కథలోకి వెళ్తే…

మాల్డోవాలో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతోంది. అమెరికన్ డెల్టా ఫోర్స్ సైనికులు ఒక ఆపరేషన్‌ లో భాగమవుతారు. కానీ వారు ఒక్కొక్కరు వింతగా మరణిస్తుంటారు. వారి శరీరాలపై ఎటువంటి బయటి గాయాలు ఉండవు. కానీ లోపలి నుంచి పూర్తిగా గడ్డకట్టుకుపోయి చనిపోతుంటారు. సైనికులు వేసుకునే అత్యాధునిక హైపర్‌స్పెక్ట్రల్ గాగుల్స్ ద్వారా మాత్రమే ఆ శత్రువు కనిపిస్తుంది. తెల్లటి పొగ లాంటి, అదృశ్య ఆకారాలే ఆ శత్రువులు. అవి తాకిన వెంటనే మనుషులు గడ్డకట్టి చనిపోతుంటారు.

Advertisement

ఈ వింత విషయాన్ని పరిశోధించడానికి డిఫెన్స్ సైంటిస్ట్ డాక్టర్ క్లైన్ (జేమ్స్ బ్యాడ్జ్ డేల్) ఎమర్జెన్సీ కాల్ ద్వారా పిలుస్తారు. మొదట సైన్యం ఇవి స్థానిక తిరుగుబాటుదారులు వాడుతున్న కొత్త కామోఫ్లాజ్ టెక్నాలజీ అని అనుకుంటుంది. కానీ డాక్టర్ క్లైన్, CIA ఏజెంట్ మాడిసన్ (ఎమిలీ మార్టిన్), మిగతా సైనిక బృందం ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత భయంకరమైన నిజం బయట పడుతుంది. ఆ అదృశ్య శక్తులు వందలాది సైనికులను క్షణాల్లో అంతం చేస్తాయి. బుల్లెట్లు, బాంబులు, ట్యాంకులు ఇలాంటివి ఏమీ వాటిని ఆపలేవు.

క్లైన్, మరి కొద్దిమంది సైనికులు వాటి నుంచి ప్రాణాలతో తప్పించుకుని, ఒక పాత ఫ్యాక్టరీలో దాక్కుంటారు. అక్కడ క్లైన్ ఒక కీలకమైన విషయం గమనిస్తాడు. ఆ శక్తులు ఇనుప పొడిని (Iron Filings) దాటలేవు. క్లైన్ పరిశోధనలో ఆ శక్తులు దెయ్యాలు లేదా అతీంద్రియ శక్తులు కావని, అవి పూర్తిగా మానవ నిర్మిత ఆయుధాలు అనే షాకింగ్ విషయం బయట పడుతుంది. గత ప్రభుత్వ శాస్త్రవేత్తలు మనుషుల పరమాణువులను మార్చి, ఐదవ స్థితి అయిన బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్లోకి మార్చి ఈ భయంకరమైన సైనిక ఆయుధాలను సృష్టించారు.

Advertisement

వాటిని అడ్డుకోవాలంటే సాధారణ ఆయుధాలు సరిపోవు. కేవలం ప్లాస్మా ఆయుధాలుతోనే వాటిని నాశనం చేయవచ్చని క్లైన్ కనుగొంటాడు. సమయం తక్కువగా ఉండటంతో అతను సైన్యంలోని ట్యాంకులు, గన్‌లను అత్యవసరంగా ప్లాస్మా డిస్‌చార్జ్ ఆయుధాలుగా మారుస్తాడు. మెరికన్ సైన్యం ఆ శక్తులు ఉత్పత్తి అవుతున్న ప్రధాన కేంద్రమైన మస్సరోవ్ పవర్ ప్లాంట్పై భారీ దాడికి దిగుతుంది. లోపలికి వెళ్లిన క్లైన్ భయంకరమైన దృశ్యం చూస్తాడు. ఆ భయంకరమైన దృశ్యం ఏంటి ? ఆ అదృశ్య శక్తులను పూర్తిగా చంపగలిగారా ? లేదా వాటి చేతుల్లో వీళ్ళు హతం అయ్యారా ? అన్నది స్టోరీ. ఈ సినిమా. అత్యాధునిక సైన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, టెన్షన్ నిండిన యాక్షన్, ఆలోచనలతో చివరి వరకు స్క్రీన్‌కి అతికించేస్తుంది. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

Read Also : ఓటీటీలో ఉన్న బెస్ట్ 6 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు… ఒక్కో సిరీస్ చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

Tags

Related News

అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్

బాబోయ్ దిమ్మతిరిగే యాక్షన్… బుల్లెట్టు దిగినా బిల్డింగ్ నుంచి దూకినా చావని వింత మనుషులు

జాకీ చాన్ – జాన్ సెనా కలిసి నటించిన నాన్ స్టాప్ యాక్షన్ రైడ్… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్

డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో

చేతబడులు, క్షుద్రపూజలు తిప్పి కొడితే ? కొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హర్రర్, థ్రిల్లర్!

శోభనం తర్వాత రోజే భార్య పంచాయతీ… కితకితలు పెట్టే కామెడీ ఫ్యామిలీ డ్రామా

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ

Big Stories

×