Sitanshu Kotak On Vaibhav: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ ( Ireland vs India, 1st T20I,) జట్ల మధ్య నేటి నుంచి టి20 సిరీస్ షురూ కానుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా ఈ టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఐర్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి టి20 ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేస్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైభవ్ ను ఐర్లాండ్ తో జరిగే తొలి టీ20 సందర్భంగా బరిలోకి దింపాలని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది అతనికి సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ( Sitanshu Kotak) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు వైభవ్ సూర్యవంశీ సేవలు ఇప్పుడే అవసరం లేదని.. అతడు ఆడితే మిగతా ప్లేయర్లను తొలగించాల్సి వస్తుందని వెల్లడించారు. అదే జరిగితే టీమిండియా పూర్తిగా డిస్టర్బ్ అవుతుందని పేర్కొన్నారు. బాగా రాణిస్తున్న ఆటగాళ్లను వైభవ్ కారణంగా తొలగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఉన్న బద్దలు కొట్టి చెప్పారు సితాన్షు కోటక్. దీంతో వైభవ్ అరంగేట్రంపై సితాన్షు కోటక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య టి20 సిరీస్ నేటి నుంచి జరగనున్న నేపథ్యంలో వైభవ్ ను ఆడించడంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ( Sitanshu Kotak) కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ అద్భుతమైన ఆటగాడే.. ఇందులో ఎలాంటి డౌట్ లేదని పేర్కొన్నారు. అందుకే అతన్ని బీసీసీఐ ఏరి కోరి సెలెక్ట్ చేసినట్లు గుర్తు చేశారు. ఏదో ఒక సమయంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తుందని పేర్కొన్నారు. అప్పటి వరకు వైభవ్ ఓపిక పట్టాలని కోరారు. ఇక ఐర్లాండ్ తో జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీకి అవకాశం రాకపోవచ్చు అని కుండ బద్దలు కొట్టి చెప్పారు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్.
ప్రస్తుత టి20 టీమ్ ఇండియా జట్టు అద్భుతంగా ఉందని… ప్రతి ఒక్క ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ కోసం బాగా ఆడుతున్న ప్లేయర్ల గొంతు కోయలేమని తెలిపారు. ప్రస్తుత టీమిండియా జట్టును డిస్టర్బ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ వైభవ్ కోసం టీమిండియాను డిస్టర్బ్ చేస్తే మాత్రం నెగిటివ్ రిజల్ట్ వస్తుందని హెచ్చరించారు. తన అదృష్టం బాగుంటే ఐర్లాండ్ తో జరిగే రెండు టీ20లో ఆడతాడని ఆశ భావం వ్యక్తం చేశారు సితాన్షు కోటక్.