E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

జాకీ చాన్ – జాన్ సెనా కలిసి నటించిన నాన్ స్టాప్ యాక్షన్ రైడ్… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్

జాకీ చాన్ – జాన్ సెనా కలిసి నటించిన నాన్ స్టాప్ యాక్షన్ రైడ్… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్
Advertisement

Spy Action Thriller Movie అల్టిమేట్ ట్విస్టులు, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్న అదిరిపోయే స్పై థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ జానర్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఇప్పటికే ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం యూనిక్. ఎందుకంటే యాక్షన్ ఐకాన్స్ గా పేరున్న లెజెండరీ నటులు జాకీ చాన్, జాన్ సెనా కలిసి నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ పేరు ‘హిడెన్ స్ట్రైక్’ (Hidden Strike). 2023లో విడుదలైన ఈ చైనీస్-అమెరికన్ సినిమాలో హాలీవుడ్ యాక్షన్ లెజెండ్ జాకీ చాన్, WWE సూపర్ స్టార్ జాన్ సీనా మొదటిసారి కలిసి నటించడం ప్రధాన ఆకర్షణ. స్కాట్ వా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్, స్మార్ట్ కామెడీ, బ్రోమాన్స్‌తో ఐఫీస్ట్ లా ఉంటుంది.

కథలోకి వెళ్తే…

ఇరాక్‌లోని ఒక చైనీస్ ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారంపై సాయుధ తిరుగుబాటుదారులు దాడి చేస్తారు. అక్కడ చిక్కుకుపోయిన వందలాది చైనీస్ కార్మికులను సురక్షితంగా బాగ్దాద్‌ కు తరలించే బాధ్యత మాజీ స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ లూ ఫెంగ్ (జాకీ చాన్)కి ఇస్తారు. లూ ఫెంగ్ తన బృందంతో కార్మికులను బస్సుల్లో ఎక్కించుకుని ప్రయాణం మొదలు పెడతాడు. కానీ వారు ఎంచుకున్న మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ‘హైవే ఆఫ్ డెత్’.

Advertisement

యుద్ధం, దాడులు, అన్నీ ఇక్కడ సాధారణం. మరోవైపు, ఇరాక్‌లోనే నివసిస్తున్న మాజీ అమెరికన్ మెరైన్ క్రిస్ వాన్ హార్న్ (జాన్ సీనా). ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్రిస్, తన తమ్ముడి ఒత్తిడి వల్ల డబ్బు కోసం ఒక కిడ్నాప్ ప్లాన్‌ లో చేరతాడు. కానీ ఆ ప్లాన్ వెనుక ఉన్న అసలు కుట్ర చాలా పెద్దది. కిడ్నాపర్లు లూ ఫెంగ్ కాన్వాయ్‌పై దాడి చేసి కొందరిని అపహరిస్తారు. ఈ దాడిలో క్రిస్ తమ్ముడు చనిపోవడంతో క్రిస్‌ కు నిజం అర్థమవుతుంది. వారు కేవలం డబ్బు కోసం కాకుండా, చమురు ప్లాంట్‌ ను హ్యాక్ చేసి ప్రపంచంలోనే అతి పెద్ద చమురు దోపిడీ చేయాలని ప్లాన్ వేశారని తెలుస్తుంది.

మొదట శత్రువులుగా ముందుకొచ్చిన లూ ఫెంగ్, క్రిస్, తమ సాధారణ శత్రువు ఎవరో తెలుసుకుని, వాళ్ళని మట్టుబెట్టడానికి చేతులు కలుపుతారు. ఇద్దరి మధ్య వచ్చే కామెడీ టైమింగ్, జాకీ చాన్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు, జాన్ సెనా భారీ యాక్షన్ స్టంట్లు సినిమాకు ఊపిరి పోస్తాయి. హైవే ఆఫ్ డెత్‌పై జరిగే భారీ కార్ చేజ్, భయంకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎక్స్‌ప్లోషన్స్‌ తో సినిమా క్లైమాక్స్ ఊపందుకుంటుంది. చివరికి లూ ఫెంగ్, క్రిస్ కలిసి పెద్ద కుట్రను అడ్డుకుంటారు. మరి ఇంతకీ ఆ కుట్రను ఎలా ఛేదించారు ? అక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయట పడ్డారు ? అన్నది స్టోరీ. ‘హిడెన్ స్ట్రైక్’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. జాకీ చాన్ ఫ్యాన్స్‌కి ఇది మస్ట్ వాచ్ మూవీ.

Advertisement

Read Also : పెళ్లికూతుర్లను ఎత్తుకెళ్ళే రాక్షసుడు… 350 ఏళ్ల పురాతన భవనంలో జరిగే హర్రర్ కామెడీ కథ

Tags

Related News

బాబోయ్ దిమ్మతిరిగే యాక్షన్… బుల్లెట్టు దిగినా బిల్డింగ్ నుంచి దూకినా చావని వింత మనుషులు

డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో

చేతబడులు, క్షుద్రపూజలు తిప్పి కొడితే ? కొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హర్రర్, థ్రిల్లర్!

శోభనం తర్వాత రోజే భార్య పంచాయతీ… కితకితలు పెట్టే కామెడీ ఫ్యామిలీ డ్రామా

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

Big Stories

×