E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో

డేంజరస్ అడవిలో అల్టిమేట్ అడ్వెంచర్… సీక్రెట్ డైరీతో వెంటాడే ప్రేతాత్మల ఉచ్చులో
Advertisement

Adventure Fantasy Movie : అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్స్ చూడాలని ఉందా ? నిమిషానికో ట్విస్ట్ తో ఆకట్టుకునే ఈ మూవీ మీ కోసమే. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ అమెరికన్ సినిమా హవాయి అందాలు, కుటుంబ బంధాలు, సాహసం, సంస్కృతి వంటి అంశాలతో అద్భుతంగా ఉంటుంది. బ్రూక్లిన్ నగర జీవితం నుంచి హవాయి ద్వీపాలకు వచ్చిన ఒక చిన్నారి పిల్లల ప్రయాణం ద్వారా జీవితంలో నిజమైన ‘నిధి’ ఏమిటో అందంగా చెప్పే హార్ట్ టచింగ్ చిత్రం ఇది. ఈ మూవీ పేరు ‘Finding Ohana’. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

న్యూయార్క్‌ లోని బ్రూక్లిన్‌ లో ఉంటున్న 12 ఏళ్ల అమ్మాయి పిలి. ఆమె జియోక్యాచింగ్‌లో ఛాంపియన్. ఆమెకు సాహసాలు, రహస్యాలు, ఆధారాలు వెతికి వస్తువులు కనుగొనడం అంటే ప్రాణం. ఒకరోజు ఆమె తాతగారు కిమోకు గుండెపోటు రావడంతో, పిలి తన తల్లి, అన్నయ్య ఇవాన్ తో కలిసి హవాయిలోని ఓవాహు (O’ahu) ద్వీపానికి వెళ్లాల్సి వస్తుంది. నగర జీవితానికి అలవాటు పడిన పిల్లలకు హవాయి జీవన విధానం, అడవులు, సముద్రం, సంప్రదాయాలు మొదట్లో అసౌకర్యంగా అనిపిస్తాయి. కానీ తాతయ్య స్టూడియోను వెతుకుతున్నప్పుడు పిలికి ఒక పాత, రహస్య డైరీ దొరుకుతుంది.

Advertisement

ఆ డైరీలో వందల సంవత్సరాల క్రితం హవాయి గుహల్లో దాచిన స్పానిష్ నిధి గురించి సంకేతాలు ఉంటాయి. తన తాతయ్య ఆర్థిక ఇబ్బందులను తీర్చాలనే ఉద్దేశ్యంతో పిలి ఆ నిధి వేట ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు స్థానిక బాలుడు కాస్పర్, అన్నయ్య ఇవాన్, అతని క్రష్ హనాలు తోడవుతారు. నలుగురు స్నేహితులు కలిసి హవాయి అందమైన, ప్రమాదకరమైన పర్వతాలు, గుహలు, జలపాతాలు, అడవుల గుండా ప్రయాణిస్తూ సాహసం చేస్తారు.

దారిలో విషపు సాలెపురుగులు, ప్రవహించే లావా, రహస్య పజిల్స్, ప్రకృతి సవాళ్లు ఎదురవుతాయి. చివరికి నిధి ఉన్న రహస్య స్థానానికి చేరుకుంటారు. కానీ అక్కడ వారికి దొరికేది భారీ బంగారం కాదు… హవాయి పురాణాల్లోని భయంకరమైన నైట్ మార్చర్స్ (పురాతన హవాయి యోధుల ప్రేతాత్మలు) శాపం. ఆ నిధిని తాకడంతో వారు ఆత్మల కోపానికి గురవుతారు. ఈ ప్రయాణంలోనే పిలి, ఇవాన్ తమ తండ్రి ఆత్మను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఆ పిల్లలు దెయ్యాల నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారు ? నిధిని ఇంటికి తీసుకొచ్చారా లేదా ? చివరికి ఏమైంది ? అన్నది స్టోరీ. మనసుకు హత్తుకునే సందేశంతో సాగే ఈ సినిమా పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ‘ఫైండింగ్ ఓహానా’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : మతగురువు నుండి మాఫియా నాయకుడి దగ్గరకు… థియేటర్లలో జనాలు లేక ఓటీటీలోకి మూవీ

Tags

Related News

జాకీ చాన్ – జాన్ సెనా కలిసి నటించిన నాన్ స్టాప్ యాక్షన్ రైడ్… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్

చేతబడులు, క్షుద్రపూజలు తిప్పి కొడితే ? కొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హర్రర్, థ్రిల్లర్!

శోభనం తర్వాత రోజే భార్య పంచాయతీ… కితకితలు పెట్టే కామెడీ ఫ్యామిలీ డ్రామా

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్

Big Stories

×