OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు, సింపుల్ స్టోరీ తో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ఈ మలయాళం సినిమాలు ఎక్కడా బోర్ కొట్టకుండా సింపుల్ గా సాగిపోతూ ఉంటాయి. అటువంటి రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక మూవీ, ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘కనకరాజ్యం‘ (Kanakarajyam). ఈ మూవీలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తి వల్ల, మంచి పేరు ఉండే మరొక వ్యక్తి ఇబ్బందులు పడతాడు. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
రామనాథన్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్ గా పని చేస్తుంటాడు. ఇతడు 15 సంవత్సరాలుగా ఆ ఏజెన్సీలో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. రామనాథన్ తన కూతుర్ని కూడా మంచిగా చదివిస్తూ ఉంటాడు. మరోవైపు వేణు అనే వ్యక్తి బిజినెస్ చేసి లాస్ అవుతాడు. అత్తగారి దగ్గర రెండు లక్షల అప్పు కూడా తీసుకుంటాడు. ఆ డబ్బుని ఎలా చెల్లించాలి అని బాధపడుతుంటాడు. ఫైనాన్స్ ఆఫీస్ నుంచి కూడా కొంత అప్పు తీసుకుంటాడు. వాళ్లు కూడా ఇతనికి ఫోన్ చేసి టార్చర్ చేస్తుంటారు. భార్య ఫోటోలు మార్ఫింగ్ చేసి వేణుకు పంపిస్తారు. మరోవైపు వేణు భార్య చెల్లెలికి పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లి చేయడానికి అప్పుగా ఇచ్చిన పైసలు తిరిగి చెల్లించాలని భర్త పై ఒత్తిడి తెస్తుంది. అత్తగారు ఈ పనిమీద ఇంటికి వస్తారు. బిర్యానీ తెమ్మని వేణుని భార్య అడుగుతుంది. కనీసం దానికి కూడా అతని దగ్గర డబ్బులు ఉండవు. ఈ క్రమంలో రామనాథన్ సెక్యూరిటీగా పనిచేసే జువెలరీ షాప్ లో, వేణు దొంగతనం చేయాలనుకుంటాడు.
ఒకరోజు రాత్రి అతడు తినే ఫుడ్ లో మత్తుమందు కలిపి పెడతాడు. అది తిన్న రామనాథన్ నిద్రలో జారుకుంటాడు. అక్కడ తనకు అవసరం ఉన్న ఐదు లక్షల విఉవచేసే బంగారాన్ని మాత్రమే దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉన్నాడని రామనాథన్ ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇన్ని రోజులు మంచి పేరు తెచ్చుకున్న రామనాథన్ చాలా బాధపడతాడు. ఎంప్లాయ్ బెస్ట్ అవార్డు ఇవ్వాలనుకున్న వాళ్లు కూడా వెనక్కి వెళ్తారు. ఆ తర్వాత రామనాథం ఇది ఎవరు చేశారో తెలుసుకోవాలని అనుకుంటాడు. చివరికి ఆ దొంగతనం చేసింది ఎవరో రామనాథన్ తెలుసుకుంటాడా? వేణుకి తన సమస్యలు తీరిపోతాయా? దొంగతనం చేసినట్టు కుటుంబ సభ్యులకు తెలుస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కనకరాజ్యం’ (Kanakarajyam) ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.