భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఆహ్లాదకరంగా ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. ప్రయాణ సమయంలో ప్రయాణీకులు చేసే వింత వింత పనులు తరచుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సాధారణంగా రైళ్లలో పిల్లలు ఏడ్వకుండా ఉయ్యాలలు కట్టిన సందర్భాలను చూశాం. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఏకంగా రైల్లో బట్టలు ఆరేసిన ఘటన నెటిజన్లకు క్రేజీగా అనిపిస్తంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను రెడ్డిట్ వినియోగదారుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ఏకంగా ఓ వ్యక్తి అప్పర్ బెర్త్ కు జోడించిన యుటిలిటీ ర్యాక్ మీద బట్టలు ఆరేశాడు. భారతీయ రైల్వేలో మాత్రమే ఇలాంటి అరుదైన ఘటనలు కనిపిస్తాయంటూ సదరు వ్యక్తి ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. మైసూరు-జైపూర్ ఎక్స్ ప్రెస్ లో AC కోచ్‌లో సీటు పొందలేకపోయినప్పటికీ.. ఉచిత లాండ్రీ సేవను పొందుతున్నారంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
Read Also: అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!
ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొంత మంది ఈ చర్యను ఆసక్తికరమైన చర్యగా అభివర్ణిస్తే, మరికొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలకు కనీస ప్రవర్తన తెలియకుండా పోతుందంటూ మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మరికొంత మంది డిమాండ్ చేశారు. “విదేశాలలో ఇలాంటి ఘటనలను ఎప్పుడూ చూడలేం. కేవలం ఇండియాలో మాత్రమే ఇలాంటి ఘటనలు సాధ్యం. నిజంగా అతడి ఆలోచన భలే ఉంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఈ చర్య ప్రజా రవాణలో బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది. ఇలాంటి పనులు రైళ్లలోనే కాదు, ఎక్కడా చేయడం మంచిది కాదు. ఇలాంటి పనుల వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “రైల్లో బట్టలు ఆరేయాలనే ఆలోచనే చాలా కొత్తగా ఉంది. నిజంగా నువ్వు గ్రేట్ బ్రదర్” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ ఘటన సోషల్ మీడియాలో ఎక్కువగా ఆహ్లాదాన్ని పంచింది.
ఇక గతంలో ఓ వ్యక్తి ఏకంగా సామన్లు ఉంచే ర్యాక్ లో నిద్రపోవడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. “అక్కడ పడుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది బ్రో” అంటూ ఫన్నీగా కామెంట్స్ పెట్టారు.
Read Also: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?