IND Vs SL : ఆసియా కప్ 2025 సూపర్ 4 లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ భారత్ చివరి మ్యాచ్ ఉత్కంఠగా జరిగింది. ఆ తరువాత సూపర్ ఓవర్ లో చివరగా టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ కి దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కాస్త తడబడటంతో తీక్షణ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 13 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్
మరో ఆటగాడు తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 49 పరుగులు చేశాడు. చివర్లో హాఫ్ సెంచరీ చేసుకుంటాడనుకున్న సమయంలో అక్షర్ పటేల్ స్ట్రైక్ తిలక్ వర్మకు ఇవ్వకుండా తనే చివరి బంతిని ఆడి సిక్స్ కొట్టాడు. దీంతో తిలక్ వర్మ హాప్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక శ్రీలంక జట్టు 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. కుశాల్ మెండిస్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో గోల్డెన్ డకౌట్ కావడం విశేషం. నిశాంక, కుశాల్ పెరీరా రెచ్చిపోవడంతో శ్రీలంక స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వాస్తవానికి సూపర్ 4 లో శ్రీలంక ఇప్పటివరకు ఒక్కమ్యాచ్ కూడా గెలవకుండానే వెను దిరుగుతుందని అంతా భావించారు. కానీ అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇండియాకి శ్రీలంక జట్టు ఇవాళ చుక్కలు చూపించింది. ఇది కేవలం నామమాత్రపు మ్యాచ్ కావడంతో టీమిండియాకి ఈ మ్యాచ్ ఓడినా.. గెలిచినా టీమిండియా పాకిస్తాన్ తో ఫైనల్ లో తలపడనుంది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆటగాళ్లు… అభిషేక్ శర్మ 31 బంతుల్లో 61, గిల్ 04, సూర్యకుమార్ యాద్ 12, హార్దిక్ పాండ్యా 2 తిలక్ వర్మ 49 నాటౌట్, సంజూ శాంసన్ 39, అక్షర్ పటేల్ 21 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 12 పరుగులు చేయాలి. అయితే 20 ఓవర్ లో తొలి బంతికే నిస్సాంక ఔట్ అయ్యాడు. 2వ బంతికి 2 పరుగులు లభించాయి. మూడో బంతికి1 రన్, 4 బంతికి 2 పరుగులు వచ్చాయి. 5వ బంతికి 4 పరుగులు రాగా.. 6వ బంతికి 2 పరుగులు రావడంతో మ్యాచ్ టై అయింది. ఆసియా కప్ 2025లో తొలిసారిగా సూపర్ ఓవర్ జరిగింది.
సూపర్ ఓవర్ సాగింది ఇలా..