OTT Movie : ఉత్కంఠభరితంగా సాగే సినిమాను చూడాలనుకుంటే, ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీని చూడండి. ఈ సినిమా ఒక ఒంటరి యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇంట్లో ఎవరో గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించి భయ పెడుతుంటాడు. ఆమె నిద్రలో ఉన్నప్పుడు మత్తు ఇచ్చి ఆరాచకం సృష్టిస్తాడు. క్లైమాక్స్ వరకు ఈ కథ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Door Lock’ లీ క్వాన్ దర్శకత్వం వహించిన దక్షిణ కొరియా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఇందులో గాంగ్ హ్యో-జిన్ (క్యుంగ్-మిన్), కిమ్ యే-వాన్ (హ్యో-జూ), కిమ్ సుంగ్-ఓహ్ (డిటెక్టివ్ లీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 డిసెంబర్ 5న దక్షిణ కొరియాలో థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 42 నిమిషాల నిడివితో IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
క్యుంగ్-మిన్ అనే యువతి సియోల్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తుంటుంది. ఆమె ఒక బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేస్తుంది. ఒక రోజు రాత్రి ఆమె పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన ఎలక్ట్రానిక్ డోర్ లాక్ కవర్ తెరిచి ఉన్నట్లు గమనిస్తుంది. దీనితో ఆమె భయపడి పాస్‌వర్డ్‌ను మార్చుతుంది. అయితే అదే రాత్రి నిద్రపోయే ముందు, ఆమె తన డోర్ లాక్‌లో తప్పు పాస్‌వర్డ్‌ను ఎవరో ప్రయత్నిస్తున్న శబ్దం వినిపిస్తుంది. భయపడిన క్యుంగ్ మిన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో ఆమె ఇంటి బయట సిగరెట్ ముక్క, కీప్యాడ్‌పై ఎవరివో వేలిముద్రలు, ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా కనిపించడంతో, ఆమెకు ఎవరో తన ఇంట్లోకి చొరబడినట్లు అనుమానం కలుగుతుంది.
ఇక పోలీసుల నిర్లక్ష్యంతో, స్వయంగా తానే ఈ మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. అయితే ఆమె రోజూ ఉదయం తలనొప్పితో మెలుకువలోకి వస్తుంది. సమీపంలో ఒక హత్య జరగడంతో మరింత భయపడుతుంది. ఆమె గదిలో ఎవరో రాత్రి సమయంలో ఉండి, ఆమెకు డ్రగ్ చేస్తున్నారనే విషయం తెలుసుకుంటుంది. క్యాంగ్-మిన్ ఆ స్టాకర్‌ను కనిపెట్టేందుకు ఒక డిటెక్టివ్‌లా మారి, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ అనుమానిస్తుంది. క్లైమాక్స్‌లో హంతకుడు ఎవరో ఒక షాకింగ్ రివీల్‌తో బయటపడుతుంది. ఈ హంతకుడు ఎవరు ? ఎందుకు క్యుంగ్-మిన్ వెంట పడుతున్నాడు ? ఆమె అతన్ని ఎలా కనిపెడుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్