BigTV English

OTT Movie : చెత్త కుండీలో శవం… శవం ఒకే అమ్మాయిది, ట్విస్టులు మాత్రం బోలెడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చెత్త కుండీలో శవం… శవం ఒకే అమ్మాయిది, ట్విస్టులు మాత్రం బోలెడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : వరల్డ్ వైడ్ థ్రిల్లర్ సినిమాలు హడావిడి ఎక్కువగా ఉంది. సరికొత్త కథలతో ఈ సినిమాలను ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు మేకర్స్ . కథ నచ్చితే చుసిన సినిమాలను మళ్ళీ మళ్ళీ చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘Unfinished Affairs’ జువాన్ మిగ్యూల్ డెల్ కాస్టిల్లో దర్శకత్వం వహించిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఫ్రెడ్ ఆడెనిస్ (బియాంక్వెట్టి), నటాలియా డి మోలినా (క్రిస్టినా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 మే 13న థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 43 నిమిషాల నిడివితో IMDbలో 5.4/10 రేటింగ్‌ను పొందింది.

కథలోకి వెళ్తే

బియాంక్వెట్టి అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాడ్రిడ్ నుండి స్పెయిన్‌లోని కాడిజ్‌కు బదిలీ అవుతాడు. గతంలో అతని కుమార్తె దారుణంగా హత్యకు గురవుతుంది. ఈ విషాదకరమైన సంఘటన కారణంగా అతను డిప్రెషన్ లో ఉంటాడు. ఈ సమయంలో అతను ఒక యువతి మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ యువతి శవం అతని కుమార్తెను గుర్తు చేస్తుంది. దీంతో అతను మరింత ఎమోషనల్ అవుతాడు. అతని సీనియర్లు ఈ కేసును వదిలేయమని ఆదేశిస్తారు. కానీ బియాంక్వెట్టి ఒంటరిగా ఈ కేసును పరిశోధించడం మొదలు పెడతాడు. అతని పొరుగింట్లో ఉండే క్రిస్టినా అనే నర్సు, తన మాజీ భర్త జోస్ తో ఇబ్బందులు పడుతుంటుంది. ఆమె బియాంక్వెట్టికి దగ్గరవుతూ అతనికి సపోర్ట్ గా ఉంటుంది.


బియాంక్వెట్టి దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, హత్య కేసు వెనుక అండర్‌వరల్డ్ ఉందని తెలుసుకుంటాడు. మరో వైపు క్రిస్టినా కథ కూడా ముందుకు నడుస్తుంటుంది. ఆమె తన మాజీ భర్త జోస్‌తో జరిగే గొడవల కారణంగా అభద్రతతో ఉంటుంది. అదే సమయంలో బియాంక్వెట్టి తన గతంతో పోరాడుతూ, ప్రజెంట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ చిత్రం ఒక నియో నోయిర్ శైలిలో, ఉత్కంఠభరితమైన వాతావరణం సృష్టిస్తుంది. చివరికి బియాంక్వెట్టి క్రిమినల్ ని కనిపెడతాడా ? అతని గతం ఏమిటి ? క్రిస్టినా కథ ఏ విధమైన టర్న్ తీసుకుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

Related News

OTT Movie : అబ్బాయిలను వశపరుచుకుని కోరిక తీర్చుకునే ఆడ దెయ్యం.. అమ్మాయిలనూ వదలకుండా…

OTT Movie : అర్ధరాత్రి ఆ పని చేసే జంట… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

OTT Movie : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్

OTT Movie : భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా… ఈ అరాచకం చూస్తే కన్నీళ్లు ఆగవు భయ్యా

OTT Movie : పాపం పసికూన… తల్లి శవంతో 2 రోజులు ఇంట్లోనే రెండేళ్ల పాప… టెన్షన్ తోనే పోతారు భయ్యా

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

Big Stories

×